Begin typing your search above and press return to search.

రూ.50 కోట్లు సుశాంత్ సింగ్ ఖాతా నుంచి మాయం?

By:  Tupaki Desk   |   4 Aug 2020 3:30 AM GMT
రూ.50 కోట్లు సుశాంత్ సింగ్ ఖాతా నుంచి మాయం?
X
సుశాంత్ సింగ్ కేసులో ముంబై పోలీస్ వ‌ర్సెస్ బీహార్ పోలీస్ వార్ అంత‌కంత‌కు ముదురుతోంది. వారి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం తాజాగా మరింత దిగజారింది. బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) గుప్తేశ్వర్ పాండే ముంబై పోలీసులను ప్రశ్నించడంతో వారు మనీ ట్ర‌య‌ల్ (బ్యాంక్ ఖాతాల మ‌నీ మాయం) గురించి ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెన‌క అస‌లు లాజిక్ ని ప్ర‌శ్నించ‌డంతో ముంబై పోలీసులే ఈ కేసులో ఏదీ బ‌య‌ట‌కు రాకుండా దాచేస్తున్నారా? అన్న సందేహాలు నెల‌కొన్నాయి.

గ‌డిచిన నాలుగేళ్లలో సుమారు 50 కోట్ల రూపాయలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ్యాంక్ ఖాతాకు జమ అయ్యాయి. కానీ ఆశ్చర్యకరంగా ఇవన్నీ తిరిగి డ్రా చేయ‌బ‌డ్డాయి. ఒక సంవత్సరంలో అతని ఖాతాకు రూ.17 కోట్లు జమ అయ్యాయి. అందులో రూ .15 కోట్లు డ్రా చేశారు. ఇది దర్యాప్తు చేయవలసిన కీలకమైన అంశం కాదా? మేం పెద్దరికం చేయ‌డం లేదు. అలాంటి లీడ్ ‌లు ఎందుకు పెరిగాయని మేం వారిని (ముంబై పోలీసులు) ప్రశ్నిస్తున్నాం`` అంటూ బిహారీ డీజీపీ మీడియాతో అన్నారు.

అంతకుముందు ఎస్పీ ర్యాంక్ అధికారి అయిన వినాయ్ తివారీని ముంబై మునిసిపల్ అధికారులు నిర్బంధించినప్పుడు బీహార్ పోలీస్ చీఫ్ తీవ్రంగా స్పందించారు. ``సాక్ష్యాలను పంచుకోవటానికి లేదా సుశాంత్ యొక్క పోస్టుమార్టం సంబంధిత‌ ఫోరెన్సిక్ నివేదికలను అందజేయడానికి బదులుగా.. బీఎంసీ వాళ్లు (ముంబై) మా ఎస్పీని దాదాపుగా అరెస్టు చేశారు. మరే ఇతర రాష్ట్ర పోలీసుల సహకారంలో ఇలాంటివి నేను ఎప్పుడూ చూడలేదు. ముంబై పోలీసుల విధానంలో చిత్తశుద్ధి ఉంటే.. వారు మాతో దర్యాప్తును షేర్ చేసుకోవాలి`` అని డీజీపీ పాండే అన్నారు.

ముంబై పోలీసులు సుశాంత్ కేసు దర్యాప్తుపై బీహార్ పోలీసులు ప్రశ్నలు లేవనెత్తడంతో, ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ మీడియాతో మాట్లాడి క్లియర్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ప్రస్తుతానికి 56 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదయ్యాయని కమిషనర్ వెల్లడించారు. జూన్ 14 న ఆత్మహత్య చేసుకునే ముందు రాత్రి బాంద్రాలోని సుశాంత్ నివాసంలో పార్టీ జ‌ర‌గింద‌న్న వాద‌న‌ను ఆయన తోసిపుచ్చారు.