సుశాంత్ మాజీ ప్రియురాలిపై రియా రివెంజ్ స్టార్ట్!

Sun Oct 18 2020 20:00:55 GMT+0530 (IST)

Sushant Singh Rajput Case

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో ట్విస్టుల గురించి తెలిసిందే. ఈ కేసులో సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిని టార్గెట్ చేస్తూ.. అతడి మాజీ ప్రేయసి అంకిత లోఖండేవాలా చేసిన వ్యాఖ్యలు కూడా తెలిసినవే. రియా వైపే వేలెత్తి చూపిన బృందంలో సుశాంత్ సోదరీమణులకు బాసటగా నిలవడంలో టీవీ నటి అంకితా లోఖండే పేరు వార్తల్లో నానింది.అయితే ఇటీవలే రియా బెయిల్ పై జైలు నుంచి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. తనకి ఈ గతి పట్టడానికి కారకులపై రియా దృష్టి సారించినట్టే కనిపిస్తోంది. తొలిగా సుశాంత్ మాజీ ప్రేయసి తన బద్ధ శత్రువు అంకిత లోఖండేపై  చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోందని సమాచారం.

నటి రియా చక్రవర్తికి పరువు నష్టం కలిగించే విషయాలు చెప్పిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రియా కోరుకుంటున్నట్లు తెలిసింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణ కేసులో వారు దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్ కోణానికి సంబంధించి ఎన్.సి.బి అరెస్టు చేసిన అనంతరం రియా చక్రవర్తి ఎంతో మానసిక వేదనకు గురైంది. అందుకే ఇప్పుడు ప్రత్యర్థులపై రివెంజ్ కి రెడీ అవుతోందట.

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కు న్యాయం చేయాలని కోరుతూ గతంలో అంకితా లోఖండే వివిధ సోషల్ మీడియా పోస్టులను షేర్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ క్లాస్ట్రోఫోబిక్ అని నటి రియా చక్రవర్తి చేసిన వాదనలను నటి అంకితా లోఖండే సోషల్ మీడియా పోస్ట్‌లో ఖండించారు. తన పోస్ట్ లో దివంగత నటుడు కాక్‌పిట్ దగ్గర నిలబడి ఉన్న విమానంలో ఎంత సంతోషంగా కనిపిస్తున్నారో పేర్కొంది. దివంగత స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విమానాల్లో ఏ రేంజులో  ఎగరాలని కోరుకుంటున్నారో ఆమె పేర్కొంది. అంకిత లోఖండే మీడియా ఇంటర్వ్యూల్లో రియా పేరును ప్రస్థావించడం చర్చకొచ్చింది. సుశాంత్ ఎప్పుడూ నిరాశలో కూరుకుపోలేదు. అలాంటి సంకేతాలను చూపించలేదు అని అంకిత ఇంటర్వ్యూల్లో పేర్కొంది. నటి రియా చక్రవర్తికి అక్టోబర్ 7 న ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రియా చక్రవర్తి సోదరుడు షోయిక్ చక్రవర్తిని కూడా ఎన్.సిబి అరెస్టు చేసిన విషయం తెలిసినదే.