బ్రేకింగ్ న్యూస్ : సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించిన కేంద్ర ప్రభుత్వం

Wed Aug 05 2020 15:00:48 GMT+0530 (IST)

Breaking Update: Sushant's Case Transferred To CBI!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్ పుత్ కేసును సీబీఐకి బదిలీ చేయాలని బీహార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సుప్రీంకోర్ట్ కి తెలియజేయడం జరిగింది. కాగా ఇప్పటి వరకు సుశాంత్ ఆత్మహత్య కేసుపై ముంబై పోలీసులు మరియు పాట్నా పోలీసులు వేర్వేరుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో బీహార్ పోలీసులకు... ముంబై పోలీసు అధికారులు సహకరించడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సుశాంత్ కేసు విచారణ నిమిత్తం ముంబై వెళ్లిన తమ సీనియర్ పోలీస్ అధికారిని బలవంతంగా హోం క్వారెంటైన్ లో పెట్టడంపై బీహార్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ సీఎంని కలిసి తన కొడుకు మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని..  సుశాంత్ ఆత్మ హత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. సుశాంత్ మరణం కేసులో ముంబై పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని.. ఈ కేసును సీబీఐ ఎంక్వైరీకి ఇవ్వాలని కోరాడు. దీంతో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ జరపాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ కోరారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్లు బీహార్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. బీహార్ ప్రభుత్వ సూచనలను అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది.