సూర్యుడివో..చంద్రుడివో..స్ఫూర్తి నింపే మెలోడీ

Mon Dec 09 2019 19:00:20 GMT+0530 (IST)

Suryudivo Chandrudivo Lyrical Song From mahesh Babu Sarileru Neekevvaru Movie

సరిలేరు నీకెవ్వరు పాటల సందడి తెలిసిందే. ప్రతి సోమవారం మాస్ ఎంబీ సాంగ్ ట్రీట్ ఉంటుందని చిత్రబృందం ప్రకటించినట్టే ఒక్కో సోమవారం ఒక్కో పాటతో అభిమానుల ముందుకు వస్తున్నారు. తాజాగా `సూర్యుడివో..చంద్రుడివో` లిరికల్ సాంగ్ విడుదలైంది.దేవీ శ్రీ మార్క్ మెలోడీ గీతమిది. పాట ఆద్యంతం రామ జోగయ్య సాహిత్యం మైమరిపించింది. ఆయన మార్క్ లిరిక్ తో ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఇక ఈ ట్యూన్ ఎక్కడా సాహిత్యాన్ని డామినేట్ చేయకపోవడం .. అందుకోసం దేవీశ్రీ తీసుకున్న జాగ్రత్తను ప్రశంసించాల్సిందే. అలాగే ఈ పాటలో మహేష్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? అన్నది రివీల్ చేశారు. ప్రొఫెసర్ భారతి(విజయశాంతి)తో ఆర్మీ మేజర్ బాంధవ్యం ఎలాంటిదో ఈ పాటలో ఆవిష్కరించారు. దేవుడెక్కడో లేడు.. వేరే కొత్తగా రాడు! అంటూ పాత్రలో హైప్ పెంచారు.

పాట ఆద్యంతం విజువల్స్ లో భారతి మ్యాడమ్ కనిపిస్తున్నారు. అలాగే కుటుంబ బంధం అనుబంధం ఎలివేట్ చేస్తూనే పచ్చని పొలం అందాల్ని చూపించారు. సందర్భానుసారం కథానాయకుడి పాత్రను హైలైట్ చేసే మెలోడీ ట్యూన్ ని గాయకుడు బి.ప్రాక్ అద్భుతమైన రాగంతో వినసొంపుగాన ఆలపించాడు. ఇక ఈ విజువల్స్ లో రత్నవేలు సహా చిత్రబృందాన్ని  కవర్ చేయడం ఆసక్తికరం. మరో నాలుగు సోమవారాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ప్రతి సోమవారం ఎంబీ మాస్ ట్రీట్ ఉంటుందన్నారు కాబట్టి ప్రతి సోమవారం సాయంత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర- దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. జనవరి 11న చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.సరిలేరు నీకెవ్వరు పాటల సందడి తెలిసిందే. ప్రతి సోమవారం మాస్ ఎంబీ సాంగ్ ట్రీట్ ఉంటుందని చిత్రబృందం ప్రకటించినట్టే ఒక్కో సోమవారం ఒక్కో పాటతో అభిమానుల ముందుకు వస్తున్నారు. తాజాగా `సూర్యుడివో..చంద్రుడివో` లిరికల్ సాంగ్ విడుదలైంది.

దేవీ శ్రీ మార్క్ మెలోడీ గీతమిది. పాట ఆద్యంతం రామ జోగయ్య సాహిత్యం మైమరిపించింది. ఆయన మార్క్ లిరిక్ తో ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఇక ఈ ట్యూన్ ఎక్కడా సాహిత్యాన్ని డామినేట్ చేయకపోవడం .. అందుకోసం దేవీశ్రీ తీసుకున్న జాగ్రత్తను ప్రశంసించాల్సిందే. అలాగే ఈ పాటలో మహేష్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? అన్నది రివీల్ చేశారు. ప్రొఫెసర్ భారతి(విజయశాంతి)తో ఆర్మీ మేజర్ బాంధవ్యం ఎలాంటిదో ఈ పాటలో ఆవిష్కరించారు. దేవుడెక్కడో లేడు.. వేరే కొత్తగా రాడు! అంటూ పాత్రలో హైప్ పెంచారు.

పాట ఆద్యంతం విజువల్స్ లో భారతి మ్యాడమ్ కనిపిస్తున్నారు. అలాగే కుటుంబ బంధం అనుబంధం ఎలివేట్ చేస్తూనే పచ్చని పొలం అందాల్ని చూపించారు. సందర్భానుసారం కథానాయకుడి పాత్రను హైలైట్ చేసే మెలోడీ ట్యూన్ ని గాయకుడు బి.ప్రాక్ అద్భుతమైన రాగంతో వినసొంపుగాన ఆలపించాడు. ఇక ఈ విజువల్స్ లో రత్నవేలు సహా చిత్రబృందాన్ని  కవర్ చేయడం ఆసక్తికరం. మరో నాలుగు సోమవారాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ప్రతి సోమవారం ఎంబీ మాస్ ట్రీట్ ఉంటుందన్నారు కాబట్టి ప్రతి సోమవారం సాయంత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర- దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. జనవరి 11న చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.