ఫస్ట్ లుక్: సుర్యవంశికి తోడైన సింగం.. సింబా!

Thu Oct 10 2019 22:15:51 GMT+0530 (IST)

Suryavanshi Movie First Look

బాలీవుడ్ లో వరస విజయాలతో దూసుకుపోతున్న మాస్ యాక్షన్ చిత్రాల డైరెక్టర్ రోహిత్ శెట్టి తాజాగా 'సూర్యవంశి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఈ సినిమాలో అక్షయ్ కుమార్.. రణవీర్ సింగ్.. అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఫిలిం మేకర్స్ కాసేపటి క్రితం విడుదల చేశారు.ఈ ఫస్ట్ లుక్ లో అక్షయ్ కుమార్.. రణవీర్ సింగ్.. అజయ్ దేవగణ్ పోలీసు యూనిఫామ్ ధరించి పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. రణవీర్ సింగ్.. అజయ్ దేవగణ్ ఇద్దరూ వెనక్కు తిరిగి ఉంటే  అక్షయ్ కుమార్ వారిద్దరి భుజాల మీద చేతులు వేసి తీక్షణంగా చూస్తున్నాడు.  ఈ ముగ్గురు పవర్ఫుల్ ఆఫీసర్ల నేపథ్యంలో దాదాపు ఇరవైమంది కమాండోలు బ్లాక్ యూనిఫాంలో ఏదో క్లిష్టమైన ఆపరేషన్ కోసం సిద్ధం అన్నట్టుగా మాస్కులు.. గన్స్ ధరించి ఉన్నారు.

ఫస్ట్ లుక్ ఒక్కసారిగా 'సూర్యవం శి' పై ఆసక్తి రేపేలా ఉంది.  రోహిత్ శెట్టి గతంలో అజయ్ దేవగణ్ తో 'సింగం'.. 'సింగం రిటర్న్స్' సినిమాలను రూపొందించిన సంగతి తెలిసిందే.  ఆ తర్వాత రణవీర్ సింగ్ తో 'సింబా' ను తెరకెక్కించాడు.  ఇవన్నీ పోలీస్ స్టోరీలే.  తాజగా ఈ 'సింగం' లోని బాజీరావు సింగం.. 'సింబా' లోని సంగ్రామ్ సింబా తో పాటు కొత్తగా అక్షయ్ కుమార్  పాత్ర వీర్ సూర్యవంశిని కలిపి 'ఆవెంజర్స్' తరహాలో ఒక కాప్ యూనివర్స్ ఫిలిం ను తెరకెక్కిస్తున్నాడు. అదే ఈ 'సూర్యవంశి'. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరో మాత్రం అక్షయ్ కుమారే. అజయ్.. రణవీర్ ఇద్దరివీ అతిథి పాత్రలే.  ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చ్ 27 న రిలీజ్ చేస్తున్నారు.