Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : బ్రదర్ కొత్త లుక్‌ భలే ఉందే

By:  Tupaki Desk   |   19 Oct 2020 4:00 AM GMT
ఫొటోటాక్‌ : బ్రదర్ కొత్త లుక్‌ భలే ఉందే
X
కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన హీరో సూర్య త్వరలో ఆకాశమే నీ హద్దురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో సూర్య లుక్‌ తో పోల్చితే ప్రస్తుతం ఆయన లుక్‌ చాలా విభిన్నంగా ఉంది. ఇటీవల సూర్య ఈ ఫొటో సోషల్‌ మీడియాలో బయటకు వచ్చింది. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న ఈ ఫొటోలో సూర్య జుట్టు పూర్తిగా వెనక్కు దువ్వేసుకుని కాస్త ఎక్కువ గడ్డంతో కనిపించాడు.

ఈ కొత్త లుక్‌ వెట్రిమారన్‌ దర్శకత్వంలో చేయబోతున్న 'వాడివాసై'సినిమా కోసం అయ్యి ఉంటుందని అంతా నమ్మకం చెబుతున్నారు. వాడివాసై సినిమా ఫస్ట్‌ లుక్‌ ను ఇప్పటికే రివీల్‌ చేశారు. అందులో సూర్య జుట్టు కాస్త ఎక్కువగానే ఉండబోతున్నట్లుగా స్కెచ్‌ లో చూపించారు. రియల్‌ గా కూడా సూర్య జుట్టును పెంచుకోవడం వల్ల సినిమా కోసమే సూర్య కొత్త హెయిర్‌ స్టైల్‌ ను ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. తప్పకుండా ఒక విభిన్నమైన సినిమాగా వాడివాసై నిలుస్తుందని సూర్య అభిమానులు భావిస్తున్నారు. జల్లికట్టు నేపథ్యంలో ఈ కథ సాగుతుందని కోలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.