Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్‌, ప‌వ‌న్ ల నుంచి స‌ర్ ప్రైజింగ్ అప్ డేట్‌

By:  Tupaki Desk   |   29 Jan 2022 6:30 AM GMT
ప్ర‌భాస్‌, ప‌వ‌న్ ల నుంచి స‌ర్ ప్రైజింగ్ అప్ డేట్‌
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ల నుంచి స‌ర్ ప్రైజింగ్ అప్ డేట్ రాబోతోందా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా క్రేజీ చిత్రం `రాధేశ్యామ్‌`. రాధా కృష్ణ కుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రంలో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించింది. భారీ బ‌డ్జెట్ తో వింటేజ్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్రం కోసం ప్ర‌భాస్ అభిమాన‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

`సాహో` వ‌చ్చి మూడేళ్లు దాట‌డంతో ప్ర‌భాస్‌సినిమా కోసం ఆయ‌న అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇట‌లీ నేప‌థ్యంలో సాగే పిరియాడిక్ ల‌వ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. డెస్టినీకి ప్రేమ‌కు లింక్ పెడుతూ స‌రికొత్త నేప‌థ్యంలో అత్యంత భారీ కాన్వాస్‌పై లార్జెర్ దెన్ లైఫ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌లై అంచ‌నాల్ని పెంచేసింది. జ‌న‌వ‌రి 14న అత్యంత భారీ స్థాయిలో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసిన మేక‌ర్స్ చివ‌రి నిమిషంలో ఒమిక్రాన్‌, క‌రోనా వైర‌స్ ల కార‌ణంగా ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేశారు.

తాజాగా ఈ మూవీ రిలీజ్ పై అభిమానుల నుంచి వొత్తిడి మొద‌లు కావ‌డం.. ప‌రిస్థితులు కూడా మ‌ళ్లీ మామూలు స్థాయికి చేరుకుంటున్న నేప‌థ్యంలో రాధేశ్యామ్` మేక‌ర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించ‌బోతున్నార‌ట‌. అభిమానుల‌కు బిగ్ అప్ డేట్ ని అందించ‌డానికి రెడీ అవుతున్నార‌ని తెలిసింది. ఇదే త‌ర‌హాలో జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయాల్సిన చిత్రం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ `భీమ్లా నాయ‌క్‌`.

ఇందులో ప‌వ‌న్ తో పాటు రానా కూడా న‌టించారు. దీంతో ఈ చిత్రంపై స‌హ‌జంట‌గానే అంచ‌నాలు పెరిగాయి. అంతే కాకుండా మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా తెర‌కెక్కించారు. మాట‌ల మాంత్రికుడు డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లే అందించ‌డం, త‌మ‌న్ సంగీతం అందించిన గీతాలు ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ కావ‌డం తెలిసిందే. `భీమ్లా నాయ‌క్‌` థీమ్ ని ఇటీవ‌ల డీజే థీమ్ గా త‌మ‌న్ రిలీజ్ చేయ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి.

అంతే కాకుండా ఇటీవ‌ల ఈ మూవీ ఉంచి లీక్ అయిన పోలీస్టేష‌న్ సీన్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప‌వ‌న్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ప‌వ‌న్ క‌నిపించిన తీరుకు ఆమ‌న ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఈ నేఫ‌థ్యంలో ఈ చిత్రం నుంచి బిగ్ అప్ డేట్ ని మేక‌ర్స్ ఇవ్వ‌బోతున్నార‌ట‌. రిలీజ్ డేట్ మారిన ద‌గ్గ‌రి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ని మేక‌ర్స్ అందించ‌లేదు. తాజాగా బిగ్ అనౌన్స్‌మెంట్ ని మేక‌ర్స్ తాజాగా చేయ‌బోతుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. రాధేశ్యామ్‌, భీమ్లా నాయ‌క్ టీమ్ ల నుంచి ఈ చిత్రానికు సంబంధించిన న్యూ రిలీజ్ డేట్ లు రాబోతున్నాయి. అదే బిగ్ అప్ డేట్ అని చిత్ర వ‌ర్గాల స‌మాచారం.