పుష్ప 2 లో నిజంగా ఇది సర్ ప్రైజే!

Tue Jun 28 2022 19:00:01 GMT+0530 (IST)

Surprise in Pushpa 2 Film

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'పుష్ప ది రైజ్'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ నెవర్ బిఫోర్ అవతార్ లో బన్నీని చూపించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయలేకపోయినా ఈ మూవీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ భారీ స్థాయిలో వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్ లు క్రేజీ క్రికెటర్లు ఈ మూవీకి ప్రచార కర్తలుగా మారి సినిమాకు మరింత హైప్ ని క్రేజ్ ని తీసుకొచ్చారు.దీంతో ఈ మూవీ ఎలాంటి ప్రచారం లేకుండానే బాలీవుడ్ లో వంద కోట్ల మార్కుని అవలీలగా దాటేసి అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఉభయ తెలుగు రాష్టాలతో పాటు తమిళ మలయాళ కన్నడ భాషల్లోనూ ఈ మూవీ భారీగానే వసూళ్లని రాబట్టింది. అయితే పక్కా ప్లాన్ తో ముందు నుంచి సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేయగలిగితే బాక్సాఫీస్ ఫిగర్స్ మరింతగా మారేవి. ఈ విషయాన్ని 'కేజీఎఫ్ 2' నిరూపించింది.

దీంతో ఈ మూవీ స్ట్రాటజీని ఫాలో అవుతున్న 'పుష్ప' టీమ్ పార్ట్ 2 కోసం భారీ ప్లాన్స్ ని సిద్ధం చేసింది. స్క్రిప్ట్  లో భారీ మార్పుల దగ్గరి నుంచి కీలక నటీనటుల వరకు ప్రతీదీ మారుస్తూ వస్తోంది. ఇక బడ్జెట్ ని కూడా రెండింతలు చేసి 400 కోట్ల మేర ఖర్చు చేయబోతోంది.

పార్ట్ 1 లో ని కీలక పాత్ర భన్వర్ సింగ్ షెకావత్ కోసం ముందు తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతిని అనుకున్నారు. అయితే కొన్ని అని వార్య కారణాల వల్ల అది కుదరలేదు. ఆ స్థానంలో మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ నటించారు.

అయితే పార్ట్ 2 కోసం అందకు మించిన పవర్ ఫుల్ పాత్ర కోసం మళ్లీ విజయ్ సేతుపతినే 'పుష్ప' టీమ్ తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ సేతుపతికి వున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అతను అయితేనే బాగుంటుందని సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుందని సుకుమార్ బన్నీ భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన తాజాగా ఓ వార్త బయటికి వచ్చింది. పార్ట్ 1 కి రష్మికతో పుష్ప వివాహంతో ఎండ్ కార్డ్ వేశారు. కానీ పార్ట్ 2లో మాత్రం రష్మిక తో పాటు మరో హీరోయిన్ కూడా వుండనుందని తెలుస్తోంది. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు ఓ చెల్లెలు వుంటుందని తననే సెకండ్ హీరోయిన్ గా సుకుమార్ రంగంలోకి దింపేస్తున్నారని చెబుతున్నారు. భన్వర్ సింగ్ పాత్రకు పుష్పకు మధ్య సెకండ్ హీరోయిన్ వుంటుందని తనని అడ్డుపెట్టుకుని ఫహద్ పాత్రని బన్నీఓ ఆట ఆడుకుంటాడని ఇన్ సైడ్ టాక్. ఇదే నిజమైతే బన్నీ ఫ్యాన్స్ కు నిజంగా ఇది సర్ ప్రైజ్ న్యూసే అని కామెంట్ లు వినిపిస్తున్నాయి.