సూర్య సినిమా నిర్మాతల రిక్వెస్ట్ కమ్ వార్నింగ్

Mon Sep 26 2022 12:25:42 GMT+0530 (India Standard Time)

Suriya's film producers' request--warning

తమిళ స్టార్ హీరో సూర్య 42వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చిన విషయం తెల్సిందే. సూర్య తో హై ఓల్టేజ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను దర్శకుడు శివ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాను తెలుగు బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ వారు స్టూడియో గ్రీన్ వారితో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని సూర్య లుక్ కానీ.. ఇతర ఎలిమెంట్స్ కానీ ఏ ఒక్కటి కూడా లీక్ అవ్వొద్దనే పట్టుదలతో యూనిట్ సభ్యులు ఉన్నారట.సినిమా నేపథ్యం ఏంటి.. సినిమాలో సూర్య రోల్ ఏంటీ అనే విషయాన్ని సస్పెన్స్ గా ఉంచే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక మార్గం ద్వారా ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకు లీక్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.

సూర్య 42 సినిమాకు అలాంటి సమస్యలు రాకుండా ఉండాలని దర్శక నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే యూనిట్ సభ్యులకు సినిమా నుండి ఏ ఒక్క చిన్న స్టిల్ బయటకు వెళ్లొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తూనే.. ఒక వేళ బయటకు వెళ్తే కఠిన చర్యలు తప్పవు అన్నట్లుగా యూనిట్ సభ్యులందరికి కూడా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందట.

ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సూర్య 42 సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. కాన్సెప్ట్ ఏంటీ.. నేపథ్యం ఏంటి అనే విషయమై క్లారిటీ ఇవ్వకుండా సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం ను యూనిట్ సభ్యుల వారు కల్పిస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.