Begin typing your search above and press return to search.
స్టార్ హీరో ఆ భారీ చిత్రాన్ని పక్కకు పెట్టాడట!
By: Tupaki Desk | 5 July 2020 6:17 AM GMTతమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుత పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే ఈ చిత్రంను విడుదల చేసే అవకాశం ఉంది. ఆ సినిమా తర్వాత హరి దర్శకత్వంలో ‘అరువా’ అనే భారీ యాక్షన్ చిత్రాన్ని చేసేందుకు కమిట్ అయ్యాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందని వార్తలు వచ్చాయి. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది అనుకుంటున్న సమయంలో సూర్య ఆ సినిమాను పక్కకు పెట్టినట్లుగా తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సూర్య ఆ సినిమాను పక్కకు పెట్టి వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడట. జల్లికట్టు నేపథ్యంలో సాగే ఆ చిత్రంలో సూర్య నటించబోతున్నాడు. విభిన్నమైన కథాంశంతో వెట్రిమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. మీడియం రేంజ్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని కళ్లై పులి ఎస్ థాను నిర్మించబోతున్నాడు.
జీవి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నాడు. ఆకాశమే నీ హద్దురా చిత్రం బ్యాలన్స్ వర్క్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. వెట్రి మారన్ చిత్రం తర్వాత హరి దర్శకత్వంలో సూర్య ఆ భారీ చిత్రం చేస్తాడా లేదంటే అది ఇక అంతేనా అనేది చూడాలి.