సూర్య ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసాడా...?

Mon Aug 10 2020 08:00:01 GMT+0530 (IST)

Suriya On About Movie with Director Hari

సినీ ఇండస్ట్రీలో 'హీరో - డైరెక్టర్' హిట్ కాంబినేషన్స్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య - డైరెక్టర్  హరి లది వెండితెరపై తిరుగులేని సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ కాంబోలో రూపొందిన ఐదు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. వీరి కలయికలో 'ఆరు' 'దేవా' 'యముడు' 'సింగం' 'సింగం 2' సినిమాల తర్వాత ఆరో ప్రాజెక్ట్ 'అరువా' అనే మూవీని అధికారికంగా ప్రకటించారు. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా ని హీరోయిన్ గా తీసుకున్నారు. డి.ఇమ్మన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారని.. ఏప్రిల్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి.. 2020 దీపావళి కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ మూవీ ఆగిపోయినట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.సూర్య కెరీర్లో 39వ చిత్రంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కారణాలు ఏమిటనేది తెలియనప్పటికీ సూర్య తదుపరి సినిమాని వేరే డైరెక్టర్ తో చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సూర్య తన నెక్స్ట్ మూవీ డైరెక్టర్ పాండిరాజ్ తో చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ హరి కూడా అరుణ్ విజయ్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. 'గురు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. దీంతో పాటు వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న 'వాడివసల్' అనే చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.