'వెంకీ మామ' ముందు అదొక్కటే ఛాన్స్!

Wed Sep 18 2019 15:56:41 GMT+0530 (IST)

Suresh babu On About Venky Mama Movie Release Date

చాలా కాలంగా ఎదురు చూస్తున్న దగ్గుబాటి మామ అక్కినేని అల్లుడు మూవీ 'వెంకీమామ' విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళం పరిస్థితి నెలకొన్నట్లుగా సమాచారం అందుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఆలస్యం అయ్యింది. సినిమా చాలా రోజుల పాటు చర్చల దశలోనే ఉంది. షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత కూడా మెల్లగానే ముందుకు సాగింది. ఎట్టకేలకు ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి అయ్యింది. దసరాకు సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కాని దసరా బరిలో వెంకీ మామను దింపడం లేదు.దీపావళికి అయినా సినిమాను విడుదల చేస్తారా అంటూ ఇతర సినిమాలు ముందే కన్ఫర్మ్ అయ్యి ఉన్నాయి కనుక సేఫ్ డేట్ కోసం వెంకీ మామ ఎదురు చూస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నా కూడా ఇప్పటికే ఆ తేదీకి కొన్ని చిత్రాలు కన్ఫర్మ్ అయ్యి ఉన్నాయి. ఇక సంక్రాంతికి పోటీ చాలా చాలా ఉంది. ఇలాంటి సమయంలో వెంకీ మామ చిత్రంకు ఒకే ఒక్క ఛాన్స్ అదే డిసెంబర్ మొదటి వారం. పెద్దగా పోటీ లేకపోవడం వల్ల ఆ తేదీ బెటర్ అంటూ సలహాలు ఇస్తున్నారు.

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సురేష్ బాబు విడుదల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మంచి సమయం చూసి ఎక్కువ థియేటర్లలో సురేష్ బాబు తమ బ్యానర్ లో రూపొందే సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. అలాగే వెంకీమామ చిత్రం కోసం కూడా మంచి తేదీగా డిసెంబర్ ఫస్ట్ వీక్ ను ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. రాశి ఖన్నా ఇంకా పాయల్ రాజ్ పూత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెంకీ.. చైతూల ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకం అందరిలో ఉంది. అందుకే మంచి తేదీలో విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని చిత్ర యూనిట్ సభ్యుల ప్రయత్నం.