సురేష్ బాబు మరో చిన్న సినిమా

Thu May 26 2022 06:00:01 GMT+0530 (IST)

Suresh Babu Rajahmundry Rose Milk Movie

టాలీవుడ్ బడా నిర్మాతల్లో సురేష్ బాబు కూడా ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని గత కొన్ని సంవత్సరాలుగా సురేష్ బాబు నుండి పెద్ద సినిమాలు కాకుండా మీడియం రేంజ్ సినిమాలు.. చిన్న సినిమాలు.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు మాత్రమే వస్తున్నాయి. చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలతోనే ఎక్కువ లాభాలు దక్కించుకుంటున్న సురేష్ బాబు మళ్లీ మళ్లీ చిన్న సినిమాలనే నిర్మిస్తున్నారు.చిన్న సినిమాలను కూడా పూర్తిగా సొంతంగా బడ్జెట్ పెట్టకుండా తమ బ్రాండ్ వ్యాల్యూతో ఇతర నిర్మాతలతో కలిసి నిర్మించి భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తద్వారా 25 పైసల పెట్టుబడితో రూపాయి లాభం ను సురేష్ బాబు దక్కించుకుంటున్నారట. అందుకే బ్యాక్ టు బ్యాక్ సురేష్ బాబు చిన్న సినిమాలను చేస్తున్నారు. ఆయనను చూసి మరి కొందరు కూడా చిన్న సినిమాల వైపు పడుతున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ నుండి మరో చిన్న సినిమా రాబోతుంది. అదే 'రాజమండ్రి రోజ్ మిల్క్'. ఈ సినిమా ప్రదీప్ ఉప్పలపాటితో కలిసి సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. నాని బండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా ఒక ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ప్రీ లుక్ తోనే సినిమాపై ఆసక్తి కలిగించారు.

కాలేజ్ లేదా స్కూల్ ఏజ్ లవ్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా ప్రీ ఏజ్ పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ సినిమాలో నటినటులు కొత్త వారే అన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా సురేష్ బాబు బ్యానర్ నుండి వస్తుంది కనుక అంతా కొత్త వారే అయినా కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేయడంతో పాటు తప్పకుండా అన్ని చోట్ల కూడా మంచి బిజినెస్ అయ్యే అవకాశం ఉంది.

సురేష్ బాబు బ్యానర్ లో ఇప్పటికే నాలుగు అయిదు చిన్న.. మీడియం రేంజ్ సినిమాలు రూపొందుతున్నాయి. ఆ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా జాయిన్ అయ్యింది. లవ్ స్టోరీలకు ఎప్పుడు కూడా మంచి ఆధరణ ఉంటుంది. కనుక ఈ సినిమా తో సురేష్ బాబు మరో చిన్న సినిమా పెద్ద హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.