మ్యూజిక్ లేబుల్ రంగంలో అగ్ర నిర్మాత మార్క్..!

Tue Jun 22 2021 11:00:01 GMT+0530 (IST)

Suresh Babu Coming Up With A New Music Label

ఆడియో రంగమంటే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క దిగ్గజ సంస్థ ఆదిత్య మ్యూజిక్. కొన్ని దశాబ్ధాలుగా ఆదిత్య మార్కెట్ లో అగ్రగామిగా చలామణిలో ఉంది. అగ్ర హీరోల సినిమాల మ్యూజిక్ ఆల్బమ్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారానే  విడుదలవుతుంటాయి. ఇంకా పలు ఆడియో కంపెనీలు ఉన్నప్పటికీ ఆదిత్య టాలీవుడ్ లో నంబర్ వన్ బ్రాండ్ లేబుల్ గా మార్కెట్ లో వెలుగుతోంది. తమిళ్ ..తెలుగు రెండు భాషల్లోనూ ఆదిత్య మ్యూజిక్ కి తిరుగులేదు. అయితే ఇప్పుడు తెలుగులో ఆదిత్య మ్యూజిక్ కి గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.అగ్ర నిర్మాత.. పంపిణీ దారుడు.. ఎగ్జిబిటర్.. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు కూడా ఓ మ్యూజిక్ కంపెనీని లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎస్. పి మ్యూజిక్ అనే లేబుల్ తో ఈ సంస్థ మార్కెట్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఈ సంస్థ ద్వారా వీడియో..ఆడియో హక్కులు తీసుకుని నేరుగా సదరు సంస్థ ద్వారా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం డిజిటల్ మాధ్యమాలకు ఈ లేబుల్స్ కీలకంగామారిన సంగతి తెలిసిందే.

ఇక ఆడియో రంగంలో పోటీ చాలా కాలంగా ఉన్నా కానీ ఆదిత్య మ్యూజిక్ తనదైన మార్క్ చూపించగలిగింది. ఎస్పీ మ్యూజిక్ లేబుల్ ని ఇకపై ఎదుర్కోవాల్సి ఉంటుంది. కరోనా క్రైసిస్ కాలంలో ఓటీటీ వెయిట్ ఎలా పెరిగిందో చూశాం. లాక్ డౌన్ కారణంగా చాలా విషయాలపై స్పష్ఠత వచ్చింది. థియేటర్లు మూత పడటంతో ఓటీటీలోనే ఎంటర్ టైన్ మెంట్ ని పొందుతున్నారు. రానున్న రోజుల్లో డీటీహెచ్ ( డైరెక్ట్ టూ హోమ్) కూడా అందుబాటులోకి రానుంది. అది కార్య రూపం దాల్చితే థియేటర్లు పూర్తిగా మూత పడతాయి.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు ఫంక్షన్ హాల్స్ గా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిణామాలు.. మారుతోన్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకునే సురేష్ బాబు అడ్వాన్స్ డ్ గా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ అంటే టాలీవుడ్ లో ఓ బ్రాండ్. భారీ చిత్రాల నిర్మాణం..క్వాలిటీలో ది బెస్ట్ ని అందించడం అనేది మూవీమోఘల్ రామానాయుడు కాలం నుంచి నాంది పడింది. ఆ తర్వాత సురేష్ బాబు ఆ పంథాలోనే వెళ్తున్నారు. తాజాగా ఎస్.పీ మ్యూజిక్ కూడా తెలుగులో అగ్రగామి మ్యూజిక్ సంస్థగా నిలబడటం ఖాయమని అంచనా వేస్తున్నారు.