Begin typing your search above and press return to search.

180 దేశాల్లో 4400 న‌గ‌రాల్లో `నారప్ప`ను చూశారు!

By:  Tupaki Desk   |   31 July 2021 3:42 AM GMT
180 దేశాల్లో 4400 న‌గ‌రాల్లో `నారప్ప`ను చూశారు!
X
విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం నార‌ప్ప అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని 225 దేశాల్లో రిలీజ్ చేస్తే 180 దేశాల్లో రిజిస్ట‌ర్డ్ ఆడియెన్ చూశార‌ని నిర్మాత డి.సురేష్ బాబు వ్యాఖ్యానించారు. తాజాగా నార‌ప్ప స‌క్సెస్ వేడుక‌లో సురేష్ బాబు మాట్లాడుతూ..నేను సాధారణంగా మొదటి రోజు మరుసటి రోజు నా సినిమాల మార్నింగ్ షో చూస్తాను. బాక్సాఫీస్ పనితీరును తెలుసుకోవడం కోసమే అలా చేస్తాను. ఈసారి ఇది భిన్నమైన అనుభవం. కానీ అమెజాన్ లో ప్రజలు అందుబాటులో ఉన్న అన్ని 4400 పట్టణాలలో వీక్షించారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను 225 దేశాలలో ప్రదర్శించింది. 180 దేశాలలో రిజిస్ట్రేషన్ లు చేసుకుని సినిమాని వీక్షించారు`` అని తెలిపారు.

క‌థానాయ‌కుడు వెంకటేష్ మాట్లాడుతూ, ``నేను నా కెరీర్ లో చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసాను కానీ.. ఇది నాకు అతి పెద్ద ఛాలెంజ్. మునుప‌టి సినిమాల‌కు భిన్నంగా ఏదైనా చేసి సవాల్ లో నెగ్గే స్కోప్ క‌లిగింది. నేను ఈ బృందంతో కలిసి పనిచేయ‌డాన్ని ఒక‌ కుటుంబంగా భావించాను. కాబట్టి నేను తండ్రి పాత్ర‌ను సులభంగా పోషించగలిగాను. F3 థియేట‌ర్ల‌లోకి రిలీజ‌వుతుంది`` అని తెలిపారు. ప్రియమణి మాట్లాడుతూ, ``రామానాయుడు స్టూడియోస్ లో సురేష్ ప్రొడక్షన్స్ కోసం పనిచేసిన హీరోయిన్లందరి ఫోటోలు ఉన్నాయి. నేను ఎల్లప్పుడూ అక్కడ నా ఫోటో ఉండాల‌ని కోరుకుంటున్నాను. చివరకు నేను అది సాధించాను.. వెంకీ సర్ తో పనిచేయడం నా విశేషం. కాల్షీట్ల స‌మ‌స్య‌ కారణంగా నేను వారి కాంబినేషన్ లో రెండు మూడు ఆఫ‌ర్లు వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. ఇప్ప‌టికి మేము ఈ సినిమా కోసం కలిసి పనిచేయడం విధి అని ఆయన నాకు చెప్పారు. నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది`` అని అన్నారు.

హైదరాబాద్ లో జ‌రిగిన నార‌ప్ప‌ సక్సెస్ మీట్ లో చిత్ర‌బృందం స‌హా F3 దర్శకుడు అనిల్ రావిపూడి అతిథిగా పాల్గొన్నారు. వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా ప్ర‌స్తుతం ఎఫ్ 3 చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఈ సినిమాని ఆగ‌స్టు 27న రిలీజ్ చేస్తామ‌ని ఆరంభ‌మే ప్ర‌క‌టించినా క‌రోనా వ‌ల్ల చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మైంది. ఏడాది చివ‌రిలో లేదా వ‌చ్చే ఏడాది రిలీజ‌య్యేందుకు ఆస్కారం ఉంది.