ఆ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఏంటి..? ఏ హీరోతో..?

Thu Jul 16 2020 06:00:12 GMT+0530 (IST)

What is the next film of that quality director? .. what Movie?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. చాలా సూపర్ హిట్ సినిమాలను రూపొందించాడు. ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు. సినిమా క్వాలిటీ విషయంలో అసలు కంప్రమైస్ కానీ డైరెక్టర్ ఎవరంటే ముందు సురేందర్ పేరే వినిపిస్తుంది. హిట్ కానీ ప్లాప్ కానీ క్వాలిటీ అలాగే మెయింటైన్ చేస్తాడు. ఇక ఆయన చివరగా డైరెక్ట్ చేసిన సినిమా 'సైరా నరసింహరెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రూపొందించిన ఈ పాన్ ఇండియా సినిమా.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేక పోయింది. సైరా తర్వాత సురేందర్ ప్రశంసలు విమర్శలు రెండు అందుకున్నాడు. అందులో విమర్శలే ఎక్కువగా వచ్చాయట అది వేరే విషయం.ఇదిలా ఉండగా చాలాకాలంగా సురేందర్ ఎదుర్కొంటున్న ప్రశ్న.. తదుపరి సినిమా ఎవరితో..? అని. ఎందుకంటే సైరా గతేడాది అక్టోబర్ నెలలో విడుదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు తన తర్వాత సినిమా ఏ హీరోతో.. అసలు సినిమా ఏంటి..? అనేది ఇంతవరకు చెప్పలేడు సురేందర్. అవును మరి నిజమే. దాదాపు 9 నెలలు గడుస్తున్నా ఈ నెక్స్ట్ సినిమా గురించి చెప్పకపోవడం నిరాశ కలిగించే విషయమే. అయితే గత కొంతకాలంగా వరుణ్ తేజ్ తో సినిమా ఉంటుందని.. ఆ తర్వాత హీరో రామ్ తో ఓ సినిమా అని.. ఇప్పుడు మాస్ రాజా రవితేజతో తదుపరి సినిమా అని సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. మరి ముగ్గురు హీరోలకు కథలు వినిపించాడట సురేందర్. ఆ ముగ్గురు హీరోలకు ఎలాంటి కథలు చెప్పాడు? మూడు ఒకే కథనా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అంతేగాక ఏ హీరో ఓకే చేస్తాడు అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయకతప్పదు.