సెకండ్ మ్యారేజ్ పై సురేఖ వాణి క్లారిటీ..!

Mon Feb 22 2021 12:24:35 GMT+0530 (IST)

Surekha Vani Talking About Her Second Marriage

ప్రముఖ నటి సురేఖ వాణి త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆమె కుమార్తె సుప్రీత ఒత్తిడి మేరకు సురేఖ మరోసారి వివహబంధం లోకి అడుగుపెట్టబోతున్నారని మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన రెండో పెళ్లి వార్తల గురించి సురేఖ వాణి స్పందించారు. తనకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు.తన సెకండ్ మ్యారేజ్ గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అలాంటి ఆలోచన తనకు లేదని.. అవన్నీ ఒట్టి పుకార్లేనని తేల్చి చెప్పింది సురేఖ వాణి. ఇకపోతే తెలుగు - తమిళ చిత్రాల్లో నటిస్తున్న సీనియర్ నటి సురేఖ.. ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గానూ పాపులర్ అయింది. తన భర్త సురేష్ తేజ డైరెక్ట్ చేసిన 'మా టాకీస్ 'హార్ట్ బీట్' 'మొగుడ్స్ పెళ్లామ్స్' వంటి టీవీ షోలలో యాకర్ గా చేశారు. ఆ సమయంలోనే సురేష్ తేజను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే రెండేళ్ల క్రితం అనారోగ్యంతో సురేఖ భర్త కన్నుమూసారు. అప్పటి నుంచి తన కూతురితో కలిసి జీవనం సాగిస్తోంది.