ఫోటో స్టోరీ: సురేఖ వాణి..బాతు టబ్బు.. ఫోము.. షాంపేను!

Wed Feb 19 2020 17:27:13 GMT+0530 (IST)

Surekha Vani Latest Photoshoot

నటి సురేఖా వాణి పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు తక్కువమందే ఉంటారు.  దాదాపు యాభైకి పైగా తెలుగు సినిమాల్లో సురేఖ నటించి ప్రేక్షకులను మెప్పించారు.  'రెడీ' సినిమాలో చిట్టి నాయుడు కు అమ్మగా సురేఖ నటనను ఎవ్వరూ మర్చిపోలేరు. ఆమె కెరీర్లో ఇలాంటి పాత్రలు చాలానే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం సురేఖ భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించారు. ఇద్దరు దంపతులకు ఒక పాప.అయితే ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు సురేఖ అప్పటి నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈమధ్యే సురేఖ ఒక హాలిడే వెకేషన్ కు వెళ్ళారు. సురేఖ వాణి ఇన్స్టా లో యాక్టివ్ గా ఉంటారు కాబట్టి ఒక ఫోటో పోస్ట్ చేశారు.  వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ జీవితం చిన్నదని ప్రతిక్షణాన్ని ఆస్వాదించమని క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఫోటోలో ఒక బాత్ టబ్ లో ఫోమ్ తో సరదాగా ఆటలాడుతూ సూపర్ హాట్ పోజిచ్చారు.  పక్కనే ఒక షాంపేన్ బాటిల్.. నేపథ్యంలో అందమైన ప్రకృతి.. ఫోటో అదిరిపోయింది.  

నలభై ఐదేళ్ళ వయసులో ఫిట్ గా ఉండడం.. స్లిమ్ గా కనిపించడం అనేది చాలా కష్టమైన విషయం.  అలాంటి కష్టమైన పనిని ఎంతో సులువుగా చేసి చూపిస్తున్నారు సురేఖ.  ఈ ఫోటోను వాలెంటైన్స్ డే నాడు పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది