సుప్రీత ఎంట్రీ పై సురేఖ వాణి క్లారిటీ

Thu Jul 22 2021 05:00:01 GMT+0530 (IST)

Surekha Vani Clarity on Supreeta entry

టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సురేఖ వాణి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. ఆమె తన కూతురు తో కలిసి చేస్తున్న వీడియోలు నెట్టింట రెగ్యులర్ గా వైరల్ అవుతున్నాయి. తల్లి కూతురు ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చేస్తున్న సందడి తో రెగ్యులర్ గా వైరల్ అవుతుండటంతో సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా పరిచయం కాబోతుందా అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలా మంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా మీడియా వర్గాల వారు కూడా కొందరు చాలా నమ్మకంగా చెబుతున్నారు.ఇటీవల పలు సందర్బాల్లో సురేఖ వాణి స్పందించారు. తాజాగా ఆమె మరోసారి ఈ విషయమై స్పందిస్తూ.. ప్రసుతం సుప్రీత చదువుకుంటోంది. తను చదువుపై దృష్టి పెట్టడంతో పాటు డాన్స్ లు మరియు నటన ట్రైనింగ్ తీసుకుంటుంది. అలాగే తెలుగు డైలాగ్ డెలవరీ సరిగ్గా ఉండేందుకు గాను తెలుగు పండితుడి వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేకంగా ఈమె ను హీరోయన్ గా పరిచయం చేసేందుకు సురేఖ ప్రస్తుతానికి ఎలాంటి ప్రయత్నాలు అయితే చేయడం లేదని ఆమె మాటలను బట్టి అర్థం అవుతుంది.

సుప్రీత సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ వైరల్ అవుతూ వస్తోంది. సుప్రీత తెలుగు అమ్మాయి అయినా కూడా ముంబయి ముద్దుగుమ్మ తరహాలో అందంగా కనిపించడంతో పాటు స్టైల్ గా ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కనుక సుప్రీత సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.