ఎక్స్ క్లూసివ్: ఓటీటీ లకు కావాల్సింది సినిమా వాళ్లే!

Fri Jun 05 2020 17:00:57 GMT+0530 (IST)

Surbhi Exclusive Chit Chat with Tupakidotcom

* హాయ్ సురభి ఎలా ఉన్నారు?హాయ్ - నేను బావున్నా - మీరు బావున్నారా?

* ఐ యామ్ ఫైన్ - ముందుగా మీకు పుట్టిన రోజు శుభకాంక్షలు - ఎలా జరింది ఈ ఏడాది బర్త్ డే?

థ్యాంక్యూ సో మచ్ - హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశాక ఇన్నాళ్లకు నేను నా ఇంట్లో - కుటుంబ సభ్యులు మధ్య పుట్టినరోజు జరపుకున్నాను. ఓవైపు ఆనందం మరో వైపున బాధ - ఇంట్లో వాళ్లతో పుట్టిన రోజు చేసుకున్నా అనే ఆనందం - వర్క్ ని మిస్ అవుతున్నా అనే బాధ - త్వరగా ఈ క్రైసిస్ నుంచి అంతా కోలుకోవాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.

* ఇప్పుడు ఏ సినిమాల్లో నటిస్తున్నారు?

శశి అనే ఓ మ్యూజికల్ లవ్ స్టోరీలో నటిస్తున్నా - ఇందులో నా క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. డైలాగ్స్ కంటే ఎక్కువగా హావభావలతోనే నా పెర్ఫామెన్స్ ఉంటుంది. అలా అని నేను ఎప్పుడూ యాక్ట్ చేసే సైలెంట్ - ఫ్యామిలీ గర్ల్ టైపు రోల్ అని చెప్పలేను. కానీ ఈ పాత్ర నా మనసుకి చాలా దగ్గరైంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా కంప్లీటై - ఆడియెన్స్ ముందుకి వస్తుందా అని చాలా వెయిట్ చేస్తున్న

* కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొన్ని సెక్షన్ ఆడియెన్స్ కి మాత్రమే దగ్గర అవుతున్నా  - మాస్ ఆడియెన్స్ కి దూరం అవుతున్న అని ఎప్పుడైనా అనిపించిందా?

గ్లామర్ రోల్స్ గురించే కదా మీరు అడుగుతుంది - నేను గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధమే - అలాంటి క్యారెక్టర్లు కోసం నేను ట్రై చేస్తున్న. మాస్ ఆడియెన్స్ కి దగ్గర అవ్వడానికి గ్లామర్ ఒక్కటే దారి అని నేను అనుకోను. గ్లామర్ తో పాటు యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలు అలాంటి కథలు వస్తే నేను యాక్ట్ చేయడానికి సిద్ధమే. నేను నటించిన బీరువా - జెంటిల్ మెన్ వంటి సినిమాల్లో చేసిన పాత్రలు అలాంటివే కదా

* శశిలో మీ పాత్ర మాస్ ఆడియెన్స్ కి మిమల్ని మరింత దగ్గర చేస్తుందని అనుకుంటున్నారా?

మాస్ ఆడియెన్స్ ని - క్లాస్ ఆడియెన్స్ అనే డిఫరెన్స్ గురించి నేను ఇప్పుడు చెప్పలేను కానీ శశి సినిమాలో నా పాత్ర మాత్రం నాకు మంచి పేరు తెస్తుంది అని నేను నమ్ముతున్న - చూద్దాం ఏం అవుతుందో

* కన్నడలో కూడా అడుగుపెట్టబోతున్నారట - నిజమేనా?

అవునండి - ఫస్ట్ టైమ్ కన్నడలో యాక్ట్ చేస్తున్నా . కన్నడ గోల్డెన్ స్టార్ గణేశ్ సరసన నటిస్తున్న. ఈ మూవీలో నేనో యాంకర్ గా నటిస్తున్నా

* ప్రస్తుతం ఓటీటీలు ప్రభావం ఇండస్ట్రీలో ఎక్కువైంది - చాలా మంది నటీనటులు ఓటీటీలు నిర్మించే సినిమాల్లో - వెబ్ సిరీసుల్లో యాక్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు - దీని పై మీ స్పందన?

ఓటీటీలు జనాలకు దగ్గరవ్వడం - వాటిలో ఉంటున్న సినిమా కంటెంట్ ని ఆడియెన్స్ ఆదిరించడం చాలా మంచి విషయం. ఒక్క విషయం అందరు మర్చిపోతున్నారు - ఓటీటీలుకు కావాల్సింది సినిమా వాళ్లే - వాళ్లు ఏదైనా ప్రాజెక్ట్ లోకి సిబ్బంది - నటీనటుల కావాలంటే వారంతా మన ఫిల్మ్ నగర్ వైపే చూడాలి. దీని కారణంగా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. అలానే థియేటర్స్ ఓటీటీలు వల్ల లాస్ వస్తుందనే వాదనను కూడా నేను నమ్మను. థియేటర్ లో సినిమాను ఎంజాయ్ చేసే వారు ఎన్ని వచ్చిన అక్కడే సినిమాను చూస్తారు. ఇక మీరు అడిగినట్లుగా ఓటీటీల్లో యాక్ట్ చేయడానికి నాకు ఆఫర్స్ వస్తే - నాకు కథ నచ్చితే నేను యాక్ట్ చేయడానికి సిద్ధం

* మీ శశి ప్రాజెక్ట్ - కన్నడ ఎంట్రీ - మీరో యాక్ట్ చేయబోతున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ అవ్వాలని తుపాకీ డాట్ కామ్ టీమ్ మనః స్పూర్తిగా కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్

థ్యాంక్యూ - నేను ఫాలో అయ్యే అతి కొన్ని వెబ్ సైట్స్ లో తుపాకీ డాట్ కామ్ కూడా ఉంది. తుపాకీ రీడర్స్ అందరూ ప్లీజ్ బీ సేఫ్ - ఆల్ ది బెస్ట్