Begin typing your search above and press return to search.

శివగామి తో సుప్రీమ్ హీరో ఫైట్!

By:  Tupaki Desk   |   1 April 2020 10:10 AM GMT
శివగామి తో సుప్రీమ్ హీరో ఫైట్!
X
మెగాఫ్యామిలీ నుండి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ తక్కువ కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మెగా ఫ్యామిలీలో హిట్టా.. ఫట్టా.. అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న హీరో ఎవరంటే కేవలం సాయిధరమ్ తేజ్ మాత్రమే. ఈ కుర్ర హీరో ఇటీవలే మారుతీ దర్శకత్వంలో వచ్చిన 'ప్రతిరోజు పండగే' సినిమాతో హిట్ అందుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన హిట్ కావడంతో ఇక నుండి ఆచితూచి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం సుబ్బు అనే కొత్త దర్శకుడితో 'సోలో బతుకే సో బెటర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు కూడా చిత్రయూనిట్ తెలిపారు. అయితే ఈ చిత్రం పూర్తీ కాకముందే తన నెక్స్ట్ సినిమా ముహూర్తం కూడా కానిచ్చేశాడు యంగ్ హీరో. ప్రస్థానం సినిమాతో తన మార్క్ చూపించిన దేవాకట్టా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను జె. భగవాన్ - పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

డైరెక్టర్ దేవాకట్టా సినిమాలు అంటేనే డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమాలో సాయిధరమ్ ను కూడా విభిన్నమైన పాత్రలో చూపించనున్నాడట. ఈ సినిమాలో హీరో సాయిధరమ్ తేజ్ రాష్ట్ర సీఎంతో ఫైట్ చేయనున్నట్లు సమాచారం. ఆ సీఎం పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ గా కనిపిస్తాడని వినికిడి. ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లొసుగులను ఎత్తిచూపే ఒక యువకుడి కథే ఈ సినిమా అని అభిమానులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో..!