సినిమా చూశాక నిర్ణయం తీసుకోండి

Mon Apr 15 2019 14:34:02 GMT+0530 (IST)

Supreme Court Asks EC To Watch PM Narendra Modi Biopic And Review Its Decision

దేశ వ్యాప్తంగా పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా తీసిన ఆయన బయోపిక్ 'పీఎం నరేంద్ర మోడీ' చిత్రం విడుదలకు అడ్డంకులు ఉత్పన్నం అవుతున్నాయి. వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గత నెలలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు మోడీ సినిమా విడుదల అవ్వడం వల్ల ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని సినిమాను విడుదల కాకుండా కోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు 'పీఎం నరేంద్ర మోడీ' సినిమా విడుదలను అడ్డుకునేందుకు నో చెప్పింది. సినిమా విడుదల విషయంలో ఈసీదే తుది నిర్ణయంగా పేర్కొనడం జరిగింది.కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు నేపథ్యంలో సినిమాను పార్లమెంటు ఎన్నికలు పూర్తి అయ్యే వరకు విడుదల చేయవద్దని నిర్మాతలకు ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈసీ ఆదేశాలతో ఈసారి నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సినిమాను చూడకుండానే ఈసీ సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగిందంటూ నిర్మాతల తరపు న్యాయవాది సుప్రీం ముందు వాదనలు వినిపించడం జరిగింది. దాంతో సుప్రీం కోర్టు తాజాగా సినిమా చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలంటూ ఈసీని ఆదేశించింది. త్వరలోనే సినిమా ప్రత్యేక షోను ఈసీ మెంబర్స్ కోసం వేయాలని నిర్మాతలను ఆదేశించింది. ఈనెల 22 లోగా ఈసీ ఒక సీల్డ్ కవర్ లో సినిమాను చూసి నిర్ణయాన్ని ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈసీ ఎప్పుడు 'పీఎం నరేంద్ర మోడీ' చూడబోతున్నారు అనేది త్వరలోనే వెళ్లడయ్యే అవకాశం ఉంది. ఈసీ తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా లేదంటే సినిమాను చూసిన తర్వాత నిర్ణయాన్ని మర్చుకుంటుందా చూడాలి.