నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ స్టార్ త్రోబ్యాక్ స్టిల్..!!

Wed Jun 09 2021 16:00:01 GMT+0530 (IST)

Superstar throwback still

దేశంలో ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో సినిమా షూటింగ్స్ త్వరగా ప్రారంభించే దిశగా మేకర్స్ ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మేకర్స్ కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని షెడ్యూల్ రెడీ చేస్తున్నారట. ఆల్రెడీ సర్కారు వారి పాట మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుందని ఇదివరకు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ సినిమా సంక్రాంతి కాకుండా ఈ ఏడాది చివరిలోనే విడుదల చేసే ప్లాన్ లో మహేష్ ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఎందుకంటే వచ్చే ఏడాది కోసం ఆల్రెడీ మహేష్ త్రివిక్రమ్ సినిమాను లైన్ లో పెట్టేసాడు.అయితే తాజాగా దేశంలో లాక్ డౌన్ సడలింపులు కూడా అమలు చేసాయి ప్రభుత్వాలు. అందుకే వీలైనంత త్వరగా సర్కారు పాట ఫినిష్ చేసేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే నెలలో అంటే జులై నుండి షూటింగ్ ప్రారంభం చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ పూర్తిగా డిఫరెంట్ లుక్కులో అలరించనున్నాడు. ఇటీవలే సర్కారు టీమ్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఆ విషయంలో అభిమానులకి నిరాశే మిగిలింది. అయితే నెక్స్ట్ మహేష్ పుట్టినరోజున ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకు ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

మరి జులైలో తదుపరి షెడ్యూల్ స్టార్ట్ అవుతుందట. ఇదిలా ఉండగా.. అప్పుడప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ఆ విధంగానే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలలో సోషల్ మీడియాలో మహేష్ త్రోబ్యాక్ పిక్ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో మహేష్ డాన్స్ మూమెంట్ పోజులో ఉన్నాడు. మహేష్ నటించిన నేనొక్కడినే సినిమాలోని సాయోనారా పాటలోని స్టెప్ అని పిక్ చూస్తే అర్ధమవుతుంది. ఆ సినిమాకు మహేష్ చాలా కష్టపడ్డాడు. కానీ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు. ప్రస్తుతం అయితే మహేష్ అభిమానులకు ఆ ఫోటో ట్రీట్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సర్కారు పాట మూవీని మైత్రి మేకర్స్ - 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి మహేష్ కూడా నిర్మిస్తున్నారు.