సూపర్ స్టార్ నిర్మాణంలో చిన్న స్టార్

Sun Jan 16 2022 11:09:04 GMT+0530 (IST)

Superstar is a small star in construction

ఈమద్య కాలంలో స్టార్ హీరోలు దాదాపు అందరు కూడా నిర్మాణంలో అడుగు పెట్టారు. యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ సుదీర్ఘ కాలంగా సినిమాలను నిర్మిస్తూనే ఉన్నాడు. తన సొంత సినిమాలను ఎక్కువగా నిర్మించే కమల్ హాసన్ అప్పుడప్పుడు ఇతర హీరోల సినిమాల నిర్మాణం చేసేందుకు ఆసక్తిగా ఉంటాడు. ప్రస్తుతం విక్రమ్ సినిమా తో బిజీగా ఉన్న కమల్ హాసన్ తన నిర్మాణంలో మరో సినిమాను మొదలు పెట్టేందుకు అధికారికంగా ప్రకటన కూడా చేశాడు. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ తో కమల్ హాసన్ సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.శివ కార్తికేయన్ ప్రస్తుతం తమిళంలో మోస్ట్ లీడింగ్ యంగ్ హీరో. వీడియో జాకీగా పరిచయం అయ్యి సొంత ప్రతిభతో స్టార్ హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్ ఇటీవల డాక్టర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు. కరోనా సమయంలో భారీ వసూళ్లు దక్కించుకుని బాలీవుడ్ సినిమాలకు సైతం దక్కని ఘన దక్కించుకున్నాడు. అందుకే శివ కార్తికేయన్ ఇప్పుడు కోలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో మోస్ట్ క్రేజీ హీరో. ఆ కారణంగానే ఈయన తో తెలుగు లో ఒక భారీ సినిమా ను అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా కు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సమయంలో శివ కార్తికేయన తో కమల్ హాసన్ నిర్మాణంలో సినిమా అంటూ వచ్చిన ప్రకటన ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సూపర్ స్టార్ కమల్ హాసన్ నిర్మాణంలో సినిమా అంటే ఖచ్చితంగా అంచనాలు పీక్స్ లో ఉంటాయి. అది కూడా మోస్ట్ ట్యాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ సినిమా అవ్వడం వల్ల అందరు కూడా అంచనాలు పెంచుకుంటున్నారు. శివ కార్తికేయన్ సొంత నిర్మాణ సంస్థను కలిగి ఉన్నాడు. అయినా కూడా కమల్ హాసన్ పై ఉన్న గౌరవంతో ఆయన నిర్మాణంలో నటించడంకు చాలా ఆసక్తిగా ఉన్నాడు. సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంతో కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. అతి త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు.