సూపర్ స్టార్ బ్యాండ్.. ఆన్ లొకేషన్ పిక్ వైరల్

Mon Nov 29 2021 12:35:45 GMT+0530 (IST)

Superstar Vijay on location pic viral

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందుతున్న బీస్ట్ సినిమా కోసం తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన ప్రతి విషయం కూడా సినిమాపై అంచనాలు అంతకంతకు పెంచేలా ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్యాండ్ ట్రూప్ తో కలిసి హీరో విజయ్ మరియు హీరోయిన్ పూజా హెగ్డే సందడి చేశారు. ఆ ఫొటో వైరల్ అవుతోంది. విజయ్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఫొటోను ఆసక్తిగా చూస్తున్నారు. 100వ రోజు వంద మంది అద్బుతమైన వ్యక్తులతో షూటింగ్ సాగుతోంది అన్నట్లుగా సోషల్ మీడియాలో దర్శకుడు ఈ ఫొటోను షేర్ చేయడం జరిగింది.

బీస్ట్ సినిమా లో విజయ్ పాత్ర ఏంటీ అనే విషయమై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. పలువురు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఈ సినిమా లో విజయ్ పాత్ర బ్యాండ్ ట్రూప్ మెంబర్ అయ్యి ఉంటాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి సినిమా పై అంచనాలు పెంచుతూనే ఉన్న దర్శకుడు నెల్సన్ దిలీప్ ఏ స్థాయిలో ఈ సినిమాకు వసూళ్లు దక్కించుకుంటాడు అనేది ఆసక్తిగా మారింది. వచ్చే ఏడాది లో విడుదల కాబోతున్న ఈ సినిమా తో విజయ్ తెలుగు లో కూడా ఖచ్చితంగా గట్టిగా కొట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఈ సినిమాను తెలుగు లో దిల్ రాజు పంపిణీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు విజయ్ సినిమా లు తెలుగు పెద్దగా ఆకట్టుకోలేదు. కాని దిల్ రాజు ఈ సారి విజయ్ సినిమా ను తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా మంచి బిజినెస్ చేయడంతో పాటు భారీగా విడుదల చేసి విజయ్ కి తెలుగు రాష్ట్రాల్లో మొదటి కమర్షియల్ విజయాన్ని తెచ్చి పెడతాడని అంటున్నారు. విజయ్ తదుపరి సినిమా తెలుగు లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అనే విషయం తెల్సిందే. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది లో ఈ సినిమా పట్టాలెక్కబోతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మను ఈ సినిమా లో నటింపజేసి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.