డాటర్స్ డే స్పెషల్.. భలే పిక్ షేర్ చేసిన మహేష్

Sun Sep 25 2022 17:25:24 GMT+0530 (India Standard Time)

Superstar Heartfelt Wishes For Daughter On Daughter Day

సూపర్ స్టార్ మహేష్ బాబు సాదారణంగానే తన కూతురుతో దిగిన ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు. అలాంటిది నేడు డాటర్స్ డే అవ్వడంతో మరో ఫోటోను షేర్ చేశాడు. ఫోటోలో మహేష్ బాబు యొక్క లుక్ మరియు ఆయన కూతురు క్యూట్ స్మైల్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సితార ఎప్పుడు కూడా క్యూట్ గా అందంగా ఉంటుంది. అయితే మహేష్ బాబు లుక్ చాలా స్పెషల్ అనుకోవాలి.ఈమధ్య కాలంలో మహేష్ బాబు లైట్ గడ్డంతోనే ఉంటున్నాడు. మహేష్ బాబు గడ్డం పెంచితే వయసు పెరిగిన వ్యక్తిలా ఉంటాడు.. ఆయన గడ్డం పెంచవద్దు అని చాలా మంది బలంగా అనేవారు. కానీ ఇప్పుడు ఆయన కాస్త గడ్డం పెంచినా కూడా బాగున్నాడు అంటూ గతంలో వద్దు అన్నవారే కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు లుక్ మరియు ఆయన చేస్తున్న సినిమా పై ఈ మధ్య రెగ్యులర్ గా చర్చ జరుగుతోంది.

తాజాగా మహేష్ బాబు డాటర్స్ డే సందర్భంగా షేర్ చేసిన ఈ ఫోటో ను ఆయన అభిమానులతో పాటు అంతా కూడా లైక్ చేస్తున్నారు. మహేష్ బాబు కు తన కూతురు పై ఉన్న ప్రేమ మరియు అభిమానంను ఈ ఫోటోలో చూడవచ్చు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మహేష్ బాబుకు తన కూతురు సితార అంటే ఎంత అభిమానమో ఈ ఫోటో చూస్తే మరోసారి నిరూపితం అవుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాను మొదలు పెట్టాడు. ఇటీవలే ఒక షెడ్యూల్ ను ముగించాడు. త్వరలోనే రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. త్రివిక్రమ్ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో రాజమౌళి దర్శకత్వంలో కూడా మహేష్ బాబు నటించాల్సి ఉంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.