సూపర్ స్టార్ ఫ్యాన్ గా స్టార్ క్రికెటర్...!

Sun Jul 05 2020 20:30:18 GMT+0530 (IST)

Superstar Anthem From Friendship Movie

భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను దెబ్బతీసి ఇండియాకు ఎన్నో విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే భజ్జీ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ను సినీ ఇండస్ట్రీలో స్టార్ట్ చేశారు. హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పందన లభించింది. కాగా హర్భజన్ సింగ్ బర్త్ డే సందర్భంగా ‘ఫ్రెండ్ షిప్’ మూవీలోని ఫస్ట్ లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.'సూపర్ స్టార్ ఆంథమ్' పేరుతో ఫస్ట్ సింగిల్ ను దర్శకుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. 'నా దేహమంతా సూపర్ స్టార్.. నా ప్రాణమంతా సూపర్ స్టార్..'' అంటూ సాగిన ఈ తెలుగు సాంగ్ ని సింగర్ హేమచంద్ర ఆలపించారు. లిరిక్ రైటర్ రాజశ్రీ సుధాకర్ సాహిత్యాన్ని అందించారు. ఇక డి.ఎమ్. ఉదయ్ కుమార్ మ్యూజిక్ అందించిన ఈ పాటను తమిళంలో హీరో శింబు పాడటం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. ఈ లిరికల్ వీడియో చూస్తుంటే హర్భజన్ ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానిగా నటిస్తున్నాడని అర్థం అవుతోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో తమిళ 'బిగ్ బాస్' ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తమిళ నటుడు సతీష్ కూడా కనిపించనున్నారు. ఈ సినిమాకు జాన్ పాల్ రాజ్ మరియు శ్యామ్ సూర్య దర్శకత్వం వహించారు. సీన్ టొవా స్టూడియోస్ మరియు సినీ మాస్ స్టూడియోస్ బ్యానర్స్ పై జేపీఆర్ అండ్ స్టాలిన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాని తమిళ తెలుగు హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారని సమాచారం. కాగా తన బౌలింగ్ తో భారత్ కి ఎన్నో విజయాలు అందించిన హర్భజన్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.