సూపర్ స్టార్ సినీ ప్రస్థానం @ 47

Tue Aug 16 2022 15:01:26 GMT+0530 (IST)

Superstar 47 years in the industry

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ ప్రస్థానం అర్థ శతాబ్దంకు చేరువ అయ్యింది. తాజాగా రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరియు అందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ సందర్బంగా తండ్రి రజినీకాంత్ షర్ట్ కి జెండా పెడుతున్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో రజినీకాంత్ చాలా సింపుల్ గా ఉన్నాడు.ఆ సమయంలోనే రజినీకాంత్ సినీ ప్రస్థానం 47 ఏళ్లు పూర్తి చేసుకుంది అంటూ ఆమె పేర్కొంది. తండ్రి యొక్క గొప్ప జర్నీ గురించి ఐశ్వర్య గొప్పగా చెప్పుకొచ్చింది. మీలాంటి తండ్రి ఉన్నందుకు గర్విస్తున్నాను అంటూ కూడా ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు. 76వ స్వాంతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తండ్రి యొక్క 47 సంవత్సరాల ఇండస్ట్రీని కూడా ఆమె సెలబ్రేట్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

రజినీకాంత్ అభిమానులు కూడా తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా సూపర్ స్టార్ 47 ఇయర్స్ ఇండస్ట్రీని సోషల్ మీడియా ద్వారా లేదా మరో మార్గంలో జరుపుకున్నారు. రజినీకాంత్ ఈ మధ్య కాలంలో నటుడిగా వరుసగా సినిమాలు చేయలేక పోతున్నాడు.

అయినా కూడా ఆయన్ను దేవుడిగా పూజించే అభిమానులు తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్నారు.

ఈ మధ్య కాలంలో కమర్షియల్ సక్సెస్ లు లేకపోవడంతో పాటు ఆరోగ్యం సహకరించక పోవడం వల్ల తాజా సినిమాకు కాస్త ఎక్కువ గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు ఇటీవలే నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో జైలర్ సినిమాను రజినీకాంత్ మొదలు పెట్టాడు.

ఆ సినిమా లో రజినీకాంత్ చాలా విభిన్నంగా కనిపిస్తాడని.. చాలా కాలం తర్వాత రజినీకాంత్ మార్క్ సినిమా రాబోతుందని తమిళ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు.