42 ఏళ్ల SSMB సెలబ్రేషన్స్ CDP

Sun Nov 28 2021 23:15:15 GMT+0530 (IST)

Superstar 42 year career CDP Viral

సూపర్ స్టార్ మహేష్ టాలీవుడ్ కెరీర్ నాలుగు దశాబ్ధాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. 1979లో బాలనటుడిగా కెరీర్ ని ప్రారంభించిన మహేష్ 42 సంవత్సరాలుగా నటరంగంలో కొనసాగుతున్నారు. రాజకుమారుడు చిత్రంతో హీరోగా ప్రారంభమై ఇంతింతై అన్న చందంగా సూపర్ స్టార్ గా ఎదిగారు. స్టార్ గా అజేయంగా సత్తా చాటుతూనే ఉన్నారు.42 ఏళ్ల సినీకెరీర్ పూర్తయిన సందర్భంగా సీడీపీని లాంచ్ చేశారు. #42YearsForSSMBReignInTFI పేరుతో సీడీపీని అంతర్జాలంలో వైరల్ చేస్తున్నారు. 42ఏళ్ల గోల్డెన్ ఎరా ఆఫ్ సూపర్ స్టార్ పేరుతో సీడీపీని అభిమానులు వైరల్ చేస్తున్నారు.

మహేష్ ప్రస్తుతం `సర్కార్ వారి పాట` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తదుపరి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించనున్నారు. పాన్ ఇండియా స్టార్ గా మహేష్ మరో స్థాయిని అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఐదు దశాబ్ధాల కెరీర్ వైపు సూపర్ స్టార్ పయనం దిగ్విజయంగా సాగిపోతున్న వేళ అభిమానులు సోషల్ మీడియాల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.