Begin typing your search above and press return to search.

వ్వావ్.. సూప‌ర్ క్లిక్ అవార్డు ఇవ్వాలి!

By:  Tupaki Desk   |   25 Feb 2020 8:45 AM GMT
వ్వావ్.. సూప‌ర్ క్లిక్ అవార్డు ఇవ్వాలి!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యామిలీ సెల‌బ్రేష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. నమ్ర‌త‌- గౌత‌మ్ - సితార బృందంతో ఇప్ప‌టికే అన్ లిమిటెడ్ విదేశీ విహారాల్ని చిలౌట్ చేశారు. ఇదో రెగ్యుల‌ర్ ప్రాసెస్. ప్ర‌పంచంలో ది బెస్ట్ అన‌ద‌గ్గ‌ ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌న్నిటినీ ఇప్ప‌టికే మ‌హేష్ ఫ్యామిలీ చుట్టేసింది. లండ‌న్ -అమెరికా - ప్యారిస్- ఇబిజ .. ఒక‌టేమిటి ఘ‌ట్ట‌మ‌నేని సంద‌డి లేనిదెక్క‌డ‌?

ఈ ప్ర‌యాణాల్లో స‌రిగ‌మల్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాగ్ర‌మ్ ద్వారా న‌మ్ర‌త శిరోద్క‌ర్ షేర్ చేస్తూనే ఉన్నారు. ఆ ఫోటోలు అభిమానుల్లో అంతే జోరుగా వైర‌ల్ అవుతూ ఉంటాయి. తాజాగా మ‌హేష్ అమెరికా ట్రిప్ కి సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేశారు. ఇంత‌కుముందు అమెరికాలో జాలీ ట్రిప్ కి సంబంధించిన కొత్త ఫోటో. ఈ ఫోటోలో గౌత‌మ్ - సితార క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ ప‌ర్ఫెక్ట్ గా క్యాప్చుర్ అయ్యాయి. రెడ్ జ‌ర్కిన్ లో ఎంతో ఉత్సాహంగా క‌నిపిస్తున్న‌ గౌత‌మ్ ని మ‌హేష్ ఫోటో తీస్తున్నారు. మ‌రోవైపు ఆ ఇద్ద‌రి ముందు సితార ఎంతో ల‌వ్ లీగా త‌న కోట్ లోకి దూరిపోతోంది. ఈ ఫోటో చూడ‌గానే ఎంతో ఫ‌న్నీగా ల‌వ్ లీగా స్మైల్ పుట్టిస్తోంది.

ఇంతంద‌మైన ఫోటోని షేర్ చేసిన న‌మ్ర‌త‌నే దీనిని క్లిక్ మ‌నిపించారా? అయితే అందుకు అవార్డు ఇవ్వాల్సిందేనంటూ ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యాన్స్ ప‌ట్టుబ‌డుతున్నారు. అవార్డు వేడుక‌ల్లో సెల‌బ్రిటీ క్లిక్స్ పేరుతో ఒక ప్ర‌త్యేక‌మైన అవార్డ్ క్రియేట్ చేస్తే క‌చ్ఛితంగా న‌మ్ర‌త‌కు ఏడాదికో పుర‌స్కారం గ్యారెంటీ అనేది ఫ్యాన్స్ భావ‌న‌. అన్న‌ట్టు వంశీ పైడిప‌ల్లితో ఎంబీ 27 లేద‌ని అంటున్నారు.. ప‌ర‌శురామ్ తో అయినా ఖాయ‌మైన‌ట్టేనా? ఇంత‌కీ షూటింగ్ ఎప్పుడో అధికారికంగా చెబుతారా?!