వీడియో: 44లో 22 ఎలా? మహేష్ గుట్టు లీక్!!

Thu May 28 2020 09:15:38 GMT+0530 (IST)

Super Star Mahesh Babu First Ever Workout Video

సూపర్ స్టార్ మహేష్ తన కెరీర్ లో షర్ట్ విప్పి బాడీ బిల్డింగ్ చూపించే సన్నివేశాన్ని అభిమానులు ఎప్పటికి చూస్తారో కానీ.. అది ఇప్పట్లో అయితే సాధ్యం కాదేమో! టాలీవుడ్ హీరోలంతా ఆల్మోస్ట్ షర్ట్ విప్పి కండలు చూపించిన వాళ్లే. కానీ మహేష్ మాత్రం అందుకు పూర్తి దూరం. 44 ఏజ్ లోనూ ఆయన ఇంకా చాక్లెట్ బోయ్ లా.. లవర్ బోయ్ లా కనిపిస్తున్నారు. ఇటీవల రెగ్యులర్ గా జిమ్ చేస్తూ కాలేజ్ బోయ్ లా మారిపోతున్నారు.మహేష్ మారుతున్న రూపం చూస్తుంటే ఎవరైనా షాక్ కి గురవ్వాల్సిందే. మాస్టర్ గౌతమ్ కి అన్నయ్యలా మారిపోతున్నాడంటూ నెటిజనులు ఇప్పటికే కామెంట్లు చేస్తున్నారు. అయితే మహేష్ ఏం చేసినా అదంతా సినిమా కోసమే. ప్రస్తుతం తన కెరీర్ 27వ సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రానికి గీత గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. మహమ్మారీ వేళ నిర్భంధనంలో మహేష్ పూర్తిగా ఇంటికే అంకితమవ్వడంతో తదుపరి మూవీ కోసం తన రూపం మార్చుకునేందుకు స్ట్రిక్టుగా హార్డ్ వర్క్ చేస్తున్నారు.

తాజాగా ఇన్ స్టా ద్వారా మహేష్ భార్య నమ్రత తన వర్కవుట్ల వీడియోను షేర్ చేశారు. బహుశా మహేష్ ఎక్సర్ సైజులు చేస్తున్న తొలి వీడియో ఇదే కావొచ్చు. దీంతో ఈ వీడియో ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. చిన్నప్పుడు బొద్దుగా కనిపించిన మహేష్ `రాకుమారుడు` సినిమాతో హీరో అయినప్పుడు చాలా మారాడు. అనంతరం కాలంలో అతడి రూపంలో చాలా వేరియేషన్స్ అభిమానులు చూశారు. ఇప్పుడు 44లోనూ అతడు 22 వయసు హీరోలా కనిపిస్తుంటే అంతా షాక్ తింటున్నారు. అయితే క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ తన ఆరోగ్యాన్ని అందాన్ని మహేష్ కాపాడుకుంటున్నారు. అతడి గ్లామర్ రహస్యం కూడా ఇదే కావొచ్చు. అయితే ఈ సీక్రెట్ ని మాత్రం మహేష్ ఇంతకుముందెప్పుడూ రివీల్ చేయకపోవడంతో ఫ్యాన్స్ ప్రస్తుతం వీడియోని వైరల్ గా షేర్ చేస్తున్నారు.