Begin typing your search above and press return to search.

ట్విట్ట‌ర్ లో సూప‌ర్ స్టార్ హ‌వా

By:  Tupaki Desk   |   13 Nov 2019 4:21 AM GMT
ట్విట్ట‌ర్ లో సూప‌ర్ స్టార్ హ‌వా
X
సోష‌ల్ మీడియా లో మ‌న స్టార్ హీరోల దూకుడు గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ .. చాలా ముందు గానే ట్విట్ట‌ర్.. ఫేస్ బుక్ మాధ్య‌మాల్లో ఖాతాలు తెరిచి ఇత‌ర స్టార్ల కంటే స్పీడ్ చూపించారు. ఆ ఇద్ద‌రూ ఈ వేదిక‌ల్లో అభిమానుల కు నిరంత‌రం ట‌చ్ లో ఉంటున్నారు. ఆ త‌ర్వాత ప్ర‌భాస్.. చ‌ర‌ణ్ లాంటి స్టార్లు చాలా ఆల‌స్యం గా సామాజిక మాధ్య‌మాల్లో ట‌చ్ లోకి వ‌చ్చారు. నిరంత‌రం ల‌క్ష‌లాది అభిమానులు స‌ద‌రు స్టార్ల‌ను సోష‌ల్ మీడియా ల్లో అనుస‌రిస్తున్నారు.

ఇక ఇందు లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. నిరంత‌రం త‌న ఫ్యామిలీ కి సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ చెబుతూ ఫ్యాన్స్ ని సంతోష‌పెడుతుంటారు. ఇటీవ‌ల త‌న ఫ్యామిలీ విదేశీ వెకేష‌న్స్ కి సంబంధించిన చాలా అప్ డేట్స్ ని ఇచ్చారు మ‌హేష్. రెగ్యుల‌ర్ గా తాను న‌టించే సినిమాల ప్ర‌చారం ట్విట్ట‌ర్ వేదిక‌ గా చేస్తున్నారు. 2019లో నిరంత‌ర అప్ డేట్స్ తో మ‌హేష్ ట్విట్ట‌ర్ లో ఫాలోవ‌ర్స్ ని అ సాధార‌ణం గా పెంచుకున్నారు.

అందు కు త‌గ్గ‌ట్టే సూప‌ర్ స్టార్ మ‌హేష్ కు ట్విట్ట‌ర్ ట్రెండ్స్ లో చోటు ద‌క్కింది. తాజాగా 2019లో ట్విట్ట‌ర్ లో బెస్ట్ ఫాలోయింగ్ సంపాదించిన స్టార్ గా మహేష్ పేరును ట్విట్ట‌ర్ ఇండియా ప్ర‌క‌టించింది. మ‌హేష్ కు టాప్ 5లో చోటు ద‌క్కింద‌ని వెల్ల‌డించింది. ఇక మ‌హేష్ కంటే త‌ళా అజిత్ ట్విట్ట‌ర్ ట్రెండ్స్ లో ఇంకా స్పీడ్ గా ఉన్నారు. ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఏకంగా నంబ‌ర్ వ‌న్ స్థానం లో నిలిచారు. మ‌హేష్ న‌టించిన మ‌హ‌ర్షి.. త‌ళా అజిత్ న‌టించిన విశ్వాసం చిత్రాల అప్ డేట్స్ కోసం అభిమానులు ట్విట్ట‌ర్ లో నిరంత‌రం సెర్చ్ చేయ‌డంతో ఆ ఇద్ద‌రి పేర్లు టాప్ 5లో నిలిచాయి. ట్విట్ట‌ర్ ఇండియా ట్రెండ్స్ జాబితాలో #2019 లోక్ స‌భ ఎన్నిక‌లు #సీడ‌బ్ల్యూసీ 19- #హ్యాపీ దివాళీ ట్యాగ్స్ కూడా టాప్ 5 లో చోటు ద‌క్కించుకున్నాయి.