Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్ నటుడు మృతి

By:  Tupaki Desk   |   3 Dec 2021 5:37 AM GMT
సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్ నటుడు మృతి
X
ఉత్తరాది ప్రేక్షకులతో పాటు సౌత్‌ ప్రేక్షకుల్లో కూడా కొందరికి బ్రహ్మ మిశ్ర సుపరిచితుడు. ఆయన్ను చాలా మంది బ్రహ్మ మిశ్ర అనడం కంటే లలిత్ అంటేనే నే గుర్తు పడతారు. ఎందుకంటే ఆయన నటించిన మీర్జాపూర్‌ వెబ్‌ సిరీస్ లో లలిత్‌ పాత్రలో మెప్పించాడు. ఎంతో మంది అభిమానులను మీర్జా పూర్‌ ద్వారా దక్కించుకున్న బ్రహ్మ మిశ్ర తన అపార్ట్‌మెంట్‌ లో మృత దేహంగా పడి ఉన్నాడు. ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతానికి పోలీసులు ఈ కేసు విషయమై రహస్యంగా వివరాలను ఉంచుతున్నారు. మీడియా కు ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

మీర్జాపూర్‌ వెబ్‌ సిరీస్ లో మున్నా పాత్రకు క్లోజ్ గా ఉండే లలిత్ పాత్రలో ఈయన కనిపించాడు. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా డైలాగ్స్ చెప్పడంతో పాటు ఆకట్టుకునే నటనతో కూడా బ్రహ్మ మిశ్ర ఆ వెబ్‌ సిరీస్ లో కనిపించాడు. వరుసగా సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్న ఈ సమయంలో బ్రహ్మ మిశ్ర మృతి చెందడం ఆయన అభిమానులను మరియు ఇండస్ట్రీ వర్గాల వారిని షాక్ కు గురి చేస్తుంది. అసలు ఎలా జరిగింది అంటూ అంతా కూడా జుట్టు పీక్కుంటున్నారు. పోలీసులు ఈ విషయమై స్పందించాల్సిందిగా మీడియా వర్గాల వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

మీర్జా పూర్‌ వెబ్‌ సిరీస్ యూనిట్‌ సభ్యులు బ్రహ్మ మిశ్రా కు తమ నివాళ్లు అర్పించారు. మన లలిత్‌ మృతి.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రతి ఒక్కరు ప్రార్థించండి అంటూ సోసల్‌ మీడియా ద్వారా నటుడు దివ్వేందు తన నివాళ్లు అర్పించాడు. ఇంకా పలువురు బాలీవుడ్ ప్రముఖులు మరియు మీడియా వర్గాల వారు ప్రేక్షకులు కూడా మీర్జా పూర్‌ నటుడు బ్రహ్మ మిశ్ర అలియాస్ లలిత్‌ కు తమ నివాళ్లు అర్పించారు.