ఆ రహస్యం నా కూతురికి చెప్తా : సన్నీలియోన్

Sat Oct 16 2021 07:00:01 GMT+0530 (IST)

Sunnyleone Tell that secret to her daughter

సన్నీ లియోన్ పోర్న్ స్టార్ గా పాపులర్ అయ్యి బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇండియాలో ఆమె తక్కువ కాలంలోనే చాలా ఫేమస్ అయిపోయింది. ఆమె నటించిన ఐటం సాంగులు ప్రేక్షకులను ఒక ఊపు ఊపడంతో బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. టాలీవుడ్ లో ఆమె కొన్ని సినిమాల్లో నటించింది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని క్రేజ్ ఆమెకు వచ్చేసింది. యాక్టర్ గా సెక్సీ ఇమేజ్ ఉన్నా వ్యక్తిగతంగా స్టార్లు ఎవరూ తీసుకోని డేరింగ్ స్టెప్ తీసుకుంది సన్నీలియోన్. తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి మహారాష్ట్రలోని లాతూర్ నుంచి ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఆమెకు నిషా అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆమెను దత్తత తీసుకున్న ఎనిమిది నెలలకు ఇద్దరు కవల మగపిల్లలు పుట్టారు.సన్నీ అంటే అందరికీ హాట్ హాట్ బాలీవుడ్ సినిమాలు సీన్స్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. కానీ సన్నీ అంటే అంత మాత్రమే కాదు. ఆమె ఒకప్పుడు పోర్న్ యాక్ట్రస్. ఇప్పుడు ఆ గతం తాలూకూ ‘నీలి’ నీడల్ని దాటుకుని సరికొత్త వెలుగులోకి వచ్చేసింది. ముంబైలో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసి ముగ్గురు పిల్లలు భర్తతో హ్యాపీగా సెటిలైంది. అయితే 40 ఏళ్ల సన్నీతన గారాల కూతురు నిషా వెబర్ 6వ పుట్టిన రోజు ఘనంగా సెలబ్రేట్ చేసింది. ఫోటోల్ని వీడియోల్ని ఇన్‌స్టాలో షేర్ చేసి మురిసిపోయింది. తెర మీద సెక్సీ బ్యూటీయే అయినా నిజ జీవితంలో మాత్రం ఎంతో బాధ్యతగల తల్లి సన్నీ లియోన్. ఆమెకు భర్త డేనియల్ వెబర్ ద్వారా సరోగసీ పద్ధతిలో ఇద్దరు కవలలు. అయితే కొడుకుల కంటే ముందే సన్నీ ఇంట్లో కాలు పెట్టింది కూతురు నిషా. ఆమె మిసెస్ లియోన్ స్వంత బిడ్డ కాదు.

మహారాష్ట్రలోని లాథూర్ గ్రామంలో జన్మించింది ఆ అమ్మాయి. తనకి 21 నెలల వయస్సు ఉన్న సమయంలో సన్నీ దంపతులు దత్తత తీసుకున్నారు. నిషాగా నామకరణం చేసి 6 ఏళ్లుగా పెంచుకుంటున్నారు. బిగ్ గాళ్ అంటూ తన సొషల్ మీడియా అకౌంట్లో పేర్కొంది సన్నీ లియోన్. డేనియల్ వెబర్ సన్నీ లియోన్ ముగ్గురు పిల్లల్లో నిషానే అందరికంటే పెద్ద. సరైన సమయం వచ్చినప్పుడు తనకి అన్ని వివరాలు చెబుతానని గతంలో సన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నిషా తన స్వంత కూతురు కాదనే రహస్యం ఎప్పటికైనా తనకు చెప్పాల్సిందేనని అంగీకరించింది. అందుకే ఆమెకి కాస్త వయస్సొచ్చాక అన్నీ వివరంగా చెబుతానని అంటోంది. అంతే కాదు నిషా స్వంత తల్లి తనని తొమ్మిది నెలలు మోసి పురిటి నొప్పులు భరించి జన్మనిచ్చిందనే సత్యం కూడా తప్పక చెప్పాల్సిందేనని సన్నీ లియోన్ చెప్తుంది.