గ్యాప్ తర్వాత చెలరేగిన సన్నీలియోన్

Sat Dec 04 2021 20:00:01 GMT+0530 (IST)

Sunnyleone Latest Photos goes Viral

గత కొంతకాలంగా సన్నీలియోన్ గురించి ఆసక్తి కలిగించే అప్ డేట్ ఏదీ లేదు. అంతా సైలెంట్ గా ఉంది. కానీ సన్నీ తిరిగి బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకాలు చేస్తోందన్న టాక్ ఉంది. సొంత సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్ స్టార్ స్టక్ అభివృద్ధికి పాటుపడుతున్న ఈ బ్యూటీ మరోవైపు డేనియల్ వెబర్ తో సరోగసీ కిడ్స్ తో ఫ్యామిలీ లైఫ్ కి ఏమాత్రం భంగం కలగకుండా ప్లాన్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది.ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా సహా పలు రియాలిటీ షోల హోస్టింగ్ తర్వాత మాల్దీవుల్లో విహరిస్తూ వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడింది. కుటుంబంతో టైమ్ స్పెండ్ చేసిన సన్నీలియోన్ ఆ తర్వాత మళ్లీ షూటింగులతో బిజీ అయ్యింది.

ఇప్పుడు మరోసారి తనదైన స్టైల్లో సన్నీ విరుచుకుపడింది. తాజా ఈవెంట్ లో సిల్వర్ కలర్ ఫ్రాకులో దేవదూతలా మెరిసిపోయింది. లోక్‌మత్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ 2021 వేడుకల్లో అత్యంత అందమైన ఫ్యాషనిష్టాగా అవార్డును గెలుచుకుంది.

ఈ లుక్ లో సన్నీ లియోన్ హెయిర్ స్టైలిస్ట్ రెడ్ కార్పెట్ కి తగ్గట్టు వెట్ హెయిర్ డో ఇచ్చాడు. జెండయా- కెండల్ జెన్నర్- మార్గోట్ రాబీ వంటి పలువురు ప్రముఖులు రెడ్ కార్పెట్ పై వెట్ లుక్ తో మెరిసారు. అదే తీరుగా సన్నీ అదరగొట్టింది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సన్నీ తన తదుపరి వెబ్ సిరీస్ `అనామిక` చిత్రీకరణ సాగుతోంది. విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన అనామిక ఒక యాక్షన్ సిరీస్. మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలో జూలైలో అనామిక కోసం పనిని తిరిగి ప్రారంభించింది. మేము ఇప్పటివరకు చిత్రీకరించిన ప్రతిదీ అందంగా వచ్చింది.

విక్రమ్ తో పనిచేయడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. మా షో సెట్స్‌కి తిరిగి రావడం ఆనందంగా ఉంది`` అని సన్నీ తెలిపింది. ప్రస్తుతం సన్నీలియోన్ లేటెస్ట్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.