పాత సినిమాలు చూస్తున్న 'ఆదిపురుష్' బ్రదర్

Thu Apr 08 2021 17:00:01 GMT+0530 (IST)

Sunny Singh on Adipurush

రామయణ ఇతివృత్తం నేపథ్యంలో ప్రభాస్ రాముడిగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం షూటింగ్ కంటిన్యూస్ గా ముంబయిలో జరుపుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమా లో లక్ష్మణుడి పాత్రకు గాను సన్నీ సింగ్ ను ఎంపిక చేసినట్లుగా కొన్ని రోజుల క్రితం దర్శకుడు ఓమ్ రౌత్ అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. లక్ష్మణుడి గురించి.. ఆ పాత్ర ఎలా ఉంటే జనాలు నచ్చుతారనే విషయమై సన్నీ సింగ్ చాలా రీసెర్చ్ చేశాడట. రామాయణంపై వచ్చిన పాత సినిమాలు సీరియల్స్ లో లక్ష్మణుడి పాత్ర ఎలా ఉంది అసలు లక్ష్మణుడిని జనాలు ఎలా భావిస్తున్నారు అనే విషయాలను ఆయన పరిశోదించాడట.లక్ష్మణుడికి రాముడు ప్రపంచం. అన్న పట్ల తమ్ముడు ఎలాంటి గౌరవంతో వ్యవహరించాలి అనే విషయాన్ని లక్ష్మణుడు ప్రపంచానికి చాటి చెప్పాడు. రామాయణం ఇతివృత్తంతో వచ్చిన గత చిత్రాల్లో సక్సెస్ సినిమాలను చూస్తూ సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర ఎలా ఉంటే జనాలు ఆధరించారు అనే విషయంను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తంగా సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర కోసం చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ అయితే చేశాడని.. చేస్తున్నాడని ఆది పురుష్ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ప్రభాస్ కు తమ్ముడి పాత్రలో సన్నీ సింగ్ ఖచ్చితంగా సూట్ అవుతాడని అంటున్నారు. అయితే సన్నీ లక్ష్మణుడిగా ఎలా కనిపించబోతున్నాడు.. ఆ గెటప్ లో ఆయన ఎలా ఉంటాడు అనేది మాత్రం కాస్త ఆసక్తికరంగా జనాలు ఎదురు చూస్తున్నారు. సన్నీ గెటప్ లుక్ ను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ రాముడి లుక్ ను శ్రీరామ నవమి సందర్బంగా విడుదల చేస్తారని అంటున్నారు. అదే సమయంలో సన్నీ సింగ్ లుక్ ఏమైనా రివీల్ అయ్యేనో చూడాలి. వచ్చే ఏడాది ఆగస్టులో రాబోతున్న ఈ విజువల్ వండర్ సినిమా 500 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెల్సిందే.