లైఫ్ లో చేసిన అతి పెద్ద తప్పు గురించి ఓపెన్ అయిన సన్నీ లియోన్

Sun Oct 24 2021 14:07:59 GMT+0530 (IST)

Sunny Leone is open about the biggest mistake

అడల్ట్ స్టార్ గా పరిచయమై.. హీరోయిన్ గా మేకోవర్ కావటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. ఆ కష్టాన్ని.. ప్రతికూలతను ఎదుర్కొని ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించిన ఘనత మాత్రం సన్నీ లియోన్ కే చెల్లుతుంది. తనకున్న పోర్న్ ఇమేజ్ ను వదిలించుకొని.. సరికొత్తగా తనను తాను ప్రజెంట్ చేసుకోవటమే కాదు.. వైవాహిక జీవితానికి సంబంధించి కూడా సన్నీ లియోన్ తీరు ఆకట్టుకునేలా ఉంటుంది.కెనడా నుంచి బిగ్ బాస్ హౌస్ కు వచ్చిన ఆమె.. తన బ్యాక్ గ్రౌండ్ తో అందరి నోళ్లలో నానింది. అనంతరం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలన్న కోరికను బయటపెట్టి.. ఎట్టకేలకు ఛాన్సుల్ని దక్కించుకున్న సన్నీ బాలీవుడ్ జర్నీ తెరిచిన పుస్తకమే. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి తాజాగా ఆమె కొన్ని ఆసక్తికర అంశాల్ని పంచుకున్నారు. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అంటూ ఓపెన్ అయిన ఆమె.. ఒక స్టాండప్ కమెడియన్ తో తాను చేసిన డేటింగ్ గురించి వెల్లడించారు.

కొన్నేళ్ల క్రితం రస్సెల్ పీటర్స్ అనే స్టాండప్ కమెడియన్ తో తాను డేటింగ్ చేశానని.. అది ఎక్కువ కాలం సాగలేదు. ‘అతడితో కొన్నేళ్లు డేటింగ్ చేశా. ఆ బంధం చాలా త్వరగానే ముగిసిపోయింది. అనంతరం మేం స్నేహితులుగా మా లైఫ్ జర్నీ కొనసాగించాం. అతడితో ఎందుకు డేటింగ్ చేశానా? అనిపిపించేది. అతడితో డేటింగ్ చేయటమే జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. కానీ.. ఇప్పటికి మేం స్నేహితులుగానే ఉన్నాం’ అని సన్నీ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఇదే అంశంపై రస్సెల్ పీటర్స్ మాత్రం మరోలా స్పందించటం విశేషం.

తామిద్దరం డేటింగ్ చేసిన మాట వాస్తవమేనంటూ.. ‘‘ఆ టైం చాలా అద్భుతంగా గడిచింది. సన్నీ రియల్ స్వీట్ హార్ట్ అని మీ అందరికి తెలుసు’’ అని పేర్కొన్నాడు. ఈ డేటింగ్ ఎపిసోడ్ తర్వాత 2011 ఏప్రిల్ లో డేనియల్ వెబర్ ను పెళ్లి చేసుకోవటం.. వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది. దత్తత తీసుకున్న పిల్లలతో మొత్తం వీరికి ముగ్గురు సంతానం. ఏమైనా.. ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవటం.. నిజాల్నిమాట్లాడటానికి వెనుకాడకపోవటం సన్నీ ప్రత్యేకతగా చెప్పాలి.