సన్నీ ఎల్లో అందాలతో కుర్రాళ్లను హీటెక్కిస్తోందిగా..!

Mon Feb 22 2021 12:40:41 GMT+0530 (IST)

Sunny Leone Latest Stunning Pose

బాలీవుడ్ యాక్ట్రెస్ కరణ్ జీత్ కౌర్.. అంటే జనాలు పెద్దగా గుర్తుపట్టరు. కానీ శృంగారతార సన్నీలియోన్ అంటే మాత్రం గ్లామర్ ప్రియులు అల్లాడిపోతారు. మరి సన్నీ అంతలా ఏం చేసిందంటే మాత్రం సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్న ప్రతీ ఒక్కరికి సన్నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఫాలోయర్స్.. అంతకన్నా ఎక్కువమందికి అభిమాన నటి. సన్నీ అంటే కోట్లాది కుర్రకారుకు ఒక ఆరాధ్యదేవత. సన్నీకి కుర్రాళ్లకు ఉన్న అనుబంధం అలాంటిది మరి. ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీ పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో భర్తతో మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తోంది. లాక్ డౌన్ సమయం ఇండియాలోనే గడిపిన సన్నీ ఆ మధ్య కాలిఫోర్నియాలో కొంతకాలం గడిపింది. మళ్లీ ఇటీవలే ఇండియాకి తిరిగొచ్చి తెగ ఎంజాయ్ చేస్తోంది.సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సన్నీ.. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది. సన్నీకి స్టైలిష్ దుస్తులంటే చాలా ఇష్టమట. అందుకే ఎప్పుడు చూసినా కొత్త కొత్తగా కనిపిస్తుంది. అయితే అన్నిటికంటే కూడా సన్నీకి ఇష్టమైంది మరోటి ఉంది. అదేంటంటే బికినీ. బికినీలో ఈ గ్లోబల్ బ్యూటీకి చాలా కంఫర్ట్ ఉంటుందట. తాజాగా ఇంస్టాలో స్విమ్మింగ్ చేసిన సన్నీ పిక్స్ పోస్ట్ చేసింది. కేరళలోని పూవర్ ఐలాండ్ రిసార్టులో స్విమ్మింగ్ చేస్తూ దిగిన ఫోటోలకు పోజిచ్చింది. ఎల్లో కలర్ స్విమ్ సూట్ లో సన్నీ చాలా హ్యాపీగా కనిపిస్తోంది. సన్నీని ఈ కొత్త గ్లామరస్ స్విమ్ ఎల్లో డ్రెస్ లో చూస్తే కుర్రకారు ఎందుకు అంతలా ఆమె అందాలను ఆరాధిస్తారో అర్ధమవుతుంది. నిజంగా సన్నీ నారింజ పండులా నిగనిగలాడుతుంది. ప్రస్తుతం సన్నీ పిక్స్ నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి.