Begin typing your search above and press return to search.

సవారీ చేస్తూ రెచ్చగొడుతున్న సన్నీలియోన్..

By:  Tupaki Desk   |   2 April 2020 3:59 PM GMT
సవారీ చేస్తూ రెచ్చగొడుతున్న సన్నీలియోన్..
X
సన్నీలియోన్ భారతీయ సినీ నటి. అసలు పేరు కరేన్ మల్హోత్రా. భారత సంతతికి చెందిన సన్నీ ప్రపంచ దేశాలలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని కలిగి ఉంది. కెనడాలో పుట్టిపెరిగింది. చిన్నప్పటి నుండి స్వేచ్ఛగా పెరిగిన సన్నీకి పాటలు పాడటం - డాన్స్ చేయడం చాలా ఇష్టమట. 18యేళ్ల వయసులోనే బాయ్ ఫ్రెండ్ కి కన్యత్వాన్ని సమర్పించిన సన్నీ - ఒక ఫ్రెండ్ సహాయంతో మోడలింగ్ లోకి ప్రవేశించింది. 1999లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ తీసుకుంది. ఈ దశలో ఒక క్లబ్ డాన్సర్ పరిచయంతో అడల్ట్ ఇండస్ట్రీ వైపు ఇంటరెస్ట్ పెంచుకుంది. ఆ తర్వాత కొన్ని నగ్న ఫోటో షూట్లతో ఇంటర్నేషనల్ అడల్ట్ పత్రికలకు హాట్ గా ఫోజులిచ్చింది. 2003లో 'పెంట్ హౌస్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలుచుకొని 2005లో నీలిచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అడల్ట్ నటిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సన్నీకి లక్షల్లో ఫ్యాన్స్ క్రేజ్ ఏర్పడింది.

అనంతరం 2011లో నిర్వహించిన 'బిగ్ బాస్-5'లో కంటెస్టెంట్ గా పాల్గొంది. 2012 సంవత్సరంలో పూజ భట్ దర్శకత్వం వహించిన 'జిస్మ్ 2' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే మొత్తం అందాలను తెరపై చూపించి భారతదేశంలోని యవ్వన శృంగార పురుషుల దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఒక విధంగా చెప్పాలంటే సన్నీ కోసం పరితపించే అభిమానులు కోట్లలో ఉన్నారు. ఆ తర్వాత 'రాగిణి ఎంఎంఎస్ 2' సినిమాతో బాలీవుడ్ లో స్థిరపడింది. వరుస సినీ దర్శక నిర్మాతలు సన్నీని తమ సినిమాలలో చూపించడం కోసం ఆమె ఇంటి ముందు పడిగాపులు కాసేవారు. అంత బిజీగా ఉన్న సన్నీ 'కరెంటు తీగ' సినిమాతో తెలుగు తెరపై తళుక్కున మెరిసింది. ఇక ఎల్లప్పుడూ ఫ్యాన్స్ ని తన ఊహల్లో ముంచెత్తడానికి హాట్ హాట్ ఫోటో షూట్స్ జరుపుతూ ఉంటుంది. ఈ మధ్య సన్నీ బ్లాక్ గుర్రం పై బికినీతో సవారీ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో సన్నీ ఫోజులు చూసి కుర్రకారు హీటెక్కిపోతున్నారు. మరి మా సన్నీ అందాలను కాదనేవారు ఎవరుంటారు.. ఆరాధించేవారు తప్ప! అనుకుంటున్నారు అభిమానులు.