సన్నీ మసాజ్ తో తన్మయత్వంలో అతడు

Sat Jul 11 2020 20:00:17 GMT+0530 (IST)

He was in intimacy with Sunny Massage

బాలీవుడ్ నటి సన్నీలియోన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె రెగ్యులర్ గా ట్విట్టర్ ఇంకా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సన్నీలియోన్ తన భర్త డానియెల్ వెబర్ కు హెడ్ మసాజ్ చేస్తూ ఉంది. హెడ్ మసాజ్ చేసే పరికరంతో జుట్టు ఇంకా తలను సన్నీలియోన్ డానియెల్ కు మసాజ్ చేస్తూ ఉంటే అతడు తన్మయత్వంలో మునిగి పోయాడు. ఇంత సౌకర్యంగా ఉందో అంటూ అతడు స్వర్గంలో తేలుతున్నట్లుగా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు.ఈ వీడియోతో పాటు మీలో ఎవరైనా హెడ్ మసాజర్ వాడుతున్నారా.. ఈ పరికరంను కనిపెట్టిన వ్యక్తి ఒక గొప్ప మేధావి అయ్యి ఉంటాడు. దీనికి ఎవరు అయితే ఎక్కువగా ఇష్టపడుతారో వారు ట్యాగ్ చేయండి. ఎంతో మంది దీనికి వాడుతూ ఉంటారు. వారంతా కూడా ఇప్పుడు ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు.

హెడ్ మసాజర్ ఎంతో అద్బుతంగా ఉంటుంది. అలాంటిది సన్నీలియోన్ చేతుల్లో మసాజ్ చేయించుకుంటే ఆ ఫలితం మామూలుగా ఉండదు. స్వర్గంలో తేలి ఆడుతున్నట్లుగా ఉంటుంది. డానియెల్ వెబర్ ఎంత అదృష్టవంతుడో కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.