Begin typing your search above and press return to search.

వీడియోః సునీత+రామ్‌ వీరపనేని

By:  Tupaki Desk   |   25 Jan 2021 3:38 AM GMT
వీడియోః సునీత+రామ్‌ వీరపనేని
X
సింగర్ సునీత వివాహం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌. జనవరి 9న సునీత మిత్రుడు రామ్ వీరపనేని ని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సునీత కు చాలా మంది ఆప్తులు అభిమానులు ఉన్నారు. ఆమె పెళ్లి సందర్బంగా చాలా మంది ఆమె కష్టాలు తీరిపోయాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె మొహంలో పూర్తి స్థాయి నవ్వును చూశాం అంటున్నారు. సునీత పెళ్లి ఫొటోలు మరియు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈమద్య కాలంలో పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో షేర్‌ చేయడం ద్వారా కూడా పాపులారిటీ ఇంకా పైసలు సంపాదిస్తున్నారు. సునీత కూడా తన పెళ్లి వీడియోలను తన యూట్యూబ్‌ ఛానెల్ లో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు.

పెళ్లికి సంబంధించిన మొదటి తంతు మెహెందీ మరియు హల్దీ ఫంక్షన్‌ కు సంబంధించిన వీడియోను సునీత షేర్‌ చేశారు. ఈ వీడియోలో సునీత పిల్లలు మరియు సన్నిహితులు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్‌ కూతురు ఇంకా మాజీ భార్య రేణు దేశాయ్‌ కూడా ఉన్నారు. ఇక యాంకర్ సుమ కూడా తన డాన్స్ తో సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. యూట్యూబ్‌ లో ట్రెండ్డింగ్ లో కూడా నిలిచింది. ఈ వీడియోలో రామ్‌ వీరపనేనిని చూపించలేదు. కనుక ముందు ముందు వీడియోల్లో చూపించే అవకాశం ఉంది.