మళ్లీ మీ పాదాలను తాకాలనుంది మామయ్యః సునీత

Sun Feb 28 2021 12:38:19 GMT+0530 (IST)

Sunita is about to touch your feet again

సింగర్ సునీత కు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తో సునీత కలిసి పాడిన పాటలు సూపర్ హిట్ అవ్వడం వల్లే ఆమెకు ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని అంటూ ఉంటారు. స్టేజ్ షో ల్లో ఆయనతో కలిసి ఎన్నో వందల పాటలను సునీత పాడారు. ఆయన వల్ల ఎంతో గుర్తింపు దక్కించుకున్న సునీత ఆయన్ను ఆప్యాయంగా మామయ్య అంటూ పిలుస్తారు. ఈ విషయాన్ని ఆమె పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు. ఆయన మృతి చెందిన సమయంలో సునీత తీవ్రమైన భావోద్వేగంకు లోనయ్యారు. ఆయన మృతి చెందిన తర్వాత సోషల్ మీడియాలో పలు సందర్బాల్లో ఆయన్ను గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యారు సునీత.ఇటీవల సునీత వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. భర్త రామ్ తో సంతోషంగా ఉన్నట్లుగా ఆమె సోషల్ మీడియా పోస్ట్ లు మరియు వీడియోలను బట్టి అర్థం అవుతుంది. గత కొన్ని రోజులుగా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో సునీత ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా మరోసారి సునీత సోషల్ మీడియాలో ఎస్పీ బాలు గారి గురించి పోస్ట్ చేసి ఆయన్ను గుర్తు చేసుకున్నారు. మరోసారి మీ పాదాలను తాకాలని ఉంది మామయ్య అంటూ ఎమోషనల్ అయ్యింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆశీర్వాదం తీసుకునేందుకు గతంలో ఎన్నో సార్లు సునీత ఆయన పాదాలను మొక్కారు. ఇప్పుడు మళ్లీ ఒకసారి ఆయన పాదాలను తాలాలని ఉంది అంటూ చెప్పడం అభిమానుల హృదయాలను ద్రవింపజేసింది. బాలు గారు లేని లోటు ఎవరు తీర్చలేనిది.. ఆయన పాడిన పాటలు ఎప్పటికి ఆయన్ను చిరస్మరనీయుడిగానే ఉంచుతాయని అభిమానులు అంటున్నారు.