Begin typing your search above and press return to search.

నేనేం అస‌హ్యంగా అన్నానని.. అనుష్క‌తో గ‌వాస్క‌ర్ ఫిక‌ర్

By:  Tupaki Desk   |   26 Sep 2020 6:15 AM GMT
నేనేం అస‌హ్యంగా అన్నానని.. అనుష్క‌తో గ‌వాస్క‌ర్ ఫిక‌ర్
X
``విరాట్ కోహ్లీ వైఫల్యాలకు నేను ఆమెను ఎక్కడ నిందించాను?.. ఉన్న‌దే క‌దా అన్నాను!!`` అంటూ అనుష్క శర్మ అల‌క‌పై క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ స్పందించారు. విరాట్ కోహ్లీ వైఫల్యాలకు ఆమెను నిందించలేదని అనుష్క శర్మ ఇన్ ‌స్టాగ్రామ్ పోస్ట్ పై గవాస్కర్ స్పష్టం చేశారు. ఆర్‌.సిబి వర్సెస్ కెఎక్స్‌.ఐపి మ్యాచ్ సందర్భంగా గవాస్కర్ ను సోషల్ మీడియాలో విరుష్క అభిమానులు తూర్పార‌బ‌ట్టారు. అనుష్క ఈ వ్యాఖ్య‌ల‌కు తీవ్రంగా హ‌ర్ట్ అవ్వ‌డ‌మే గాక గ‌వాస్క‌ర్ ని ప్ర‌శ్నించారు.

ఐపిఎల్ 2020 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా హిందీ కామెంటరీ ప్యానెల్ లో ఉన్న గవాస్కర్ లాక్డౌన్ సమయంలో కోహ్లీ తగినంతగా ప్రాక్టీస్ చేయలేదని వ్యాఖ్యానించారు. అనుష్క‌తో బౌలింగ్ లో బిజీ.. ఇంకేం ఆడ‌తాడు! అనే అర్థంలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అనుష్క షేర్ చేసిన ఓ వైరల్ వీడియోను ప్రస్తావించారు.

అయితే ఈ వ్యాఖ్య‌ను చాలా మంది తప్పు ప‌ట్టారు. గవాస్కర్ వ్యాఖ్యలపై అనుష్క కూడా స్పందించి అతని నుండి వివరణ కోరింది. ఆడాళ్ల‌ను ఇందులోకి లాగ‌డం స‌రికాద‌ని అనుష్క ఫైర్ అయ్యింది. అయితే ప్ర‌ముఖ జాతీయ చానెల్ తో మాట్లాడిన గవాస్కర్ తాను అనుష్కను నిందించలేదని.. విదేశీ పర్యటనలకు తమతో పాటు రావాలని ఆటగాళ్ల భార్యలను ఎప్పుడూ కోరానని చెప్పారు.

``నేను ఆమెను ఎక్కడ నిందించాను? త‌న‌ను నిందించడం లేదు. నేను విరాట్ కు బౌలింగ్ చేస్తున్నానని వీడియో చెప్పిందని మాత్రమే చెప్తున్నాను. లాక్డౌన్ కాలంలో విరాట్ ఆ బౌలింగ్ మాత్రమే ఆడింది! ఇది లాక్డౌన్ సమయంలో టైమ్ పాస్ టెన్నిస్ బాల్.. సరదా ఆట. అంతే. విరాట్ వైఫల్యాలకు నేను ఆమెను ఎక్కడ నిందించాను?`` అని గవాస్కర్ అన్నారు. భారత మాజీ కెప్టెన్ లాక్డౌన్ సమయంలో కోహ్లీ ప్రాక్టీస్ చేయలేదని.. అతను ఈ ఒక్కసారి మాత్రమే ఆడుతున్నట్లు చెప్పాడు.