Begin typing your search above and press return to search.

పుష్పరాజ్ తో ప్రభాస్ మధ్య సమ్మర్ వార్?

By:  Tupaki Desk   |   2 Feb 2023 8:00 PM GMT
పుష్పరాజ్ తో ప్రభాస్ మధ్య సమ్మర్ వార్?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగులో కంటే ఈ సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో ఏకంగా 100 కోట్లు పైగా ఈ సినిమా రాబట్టడం విశేషం. అలాగే గత ఏడాది సోషల్ మీడియాలో హైయెస్ట్ వ్యూస్ సొంతం చేసుకున్న పాటలలో మూడు సాంగ్స్ పుష్ప సినిమాకి సంబంధించినవే ఉండడం విశేషం.

శ్రీవల్లి, ఉ అంటావా, నా సామి సాంగ్స్ మూడు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ సాంగ్స్ అన్ని భాషల్లో కూడా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయాయి. దీంతో పుష్పాకి సీక్వెల్ గా రాబోతున్న సినిమాపై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఈ సినిమాతో ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్ చేయాలని టార్గెట్ తో సుకుమార్ ఉన్నాడు. ఇదిలా ఉంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ తో హర్రర్ థ్రిల్లర్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వర్కింగ్ టైటిల్ గా రాజా డీలక్స్ అనుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా హాట్ బ్యూటీస్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ఆశికా రంగనాథ్ నటిస్తున్నారు. ఈ మూవీ కథ మొత్తం కూడా ఒక ప్యాలెస్ లో జరుగుతుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు హీరోలు మధ్య సమ్మర్ వార్ జరిగే అవకాశం ఉందనే మాట ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందా అనేది వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.