Begin typing your search above and press return to search.

మామయ్య - తాతయ్యతో సినిమాలే పెద్ద మైనస్!

By:  Tupaki Desk   |   26 May 2020 1:30 AM GMT
మామయ్య - తాతయ్యతో సినిమాలే పెద్ద మైనస్!
X
తెలుగులో 2001లో విడుదలైన "స్నేహమంటే ఇదేరా" సినిమా ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో హీరోలుగా అక్కినేని నాగార్జున - సుమంత్ నటించగా.. హీరోయిన్లుగా భూమిక చావ్లా - స్వర్గీయ ప్రత్యూష నటించారు. ఈ సినిమాను బాలశేఖరన్ తెరకెక్కించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా పై తాజాగా హీరో సుమంత్ మరోసారి ప్రస్తావించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా తన కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపిందో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో సుమంత్ బయట పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. 'నిజానికి స్నేహమంటే ఇదేరా అనే సినిమాలో నేను మా చిన్న మామయ్య నాగార్జునతో నటించినప్పుడే ఏదో డౌట్ కొట్టింది. కానీ అలాగే ఈ సినిమాలో నేను నాగార్జున ఫ్రెండ్స్ అనేసరికి అదే పెద్ద మైనస్ అయింది. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేక పోయారు. ఈ కేవలం మేం ఫ్రెండ్స్ అనే కారణంగానే బాక్స్ ఆఫీస్ వద్ద మా సినిమా పరాజయం పొందింది.

అయితే నాకు ఇలాంటి ఘోరమైన అనుభవం అంతకు ముందే జరిగింది. నేను నా కెరీర్ మొదట్లోనే తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి 'పెళ్లిసంబంధం' అనే సినిమాలో నటించాం. అది కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యింది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. మేం ఈ రెండు సినిమాల కథల విషయంలో జాగ్రత్త పడకపోవడం.. అందుకే అలా కెరీర్ మొదట్లోనే కొన్ని చేదు అనుభవాలు మా ఫ్యామిలీ వాళ్ళతోనే జరిగాయని" సుమంత్ చెప్పుకొచ్చారు. మొత్తానికి నేను మా వాళ్ళతో నటించకుండా ఉండాల్సింది అని సుమంత్ తెలిపారట. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న సుమంత్.. ఇటీవలే మళ్ళీరావా సినిమాతో విజయం అందుకున్నాడు. తాజాగా 'కపటదారి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రదీప్ కృష్ణమూర్తి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా కన్నడ హిట్ ఫిల్మ్ 'కవులదారి'కి రీమేక్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో సుమంత్ కి జోడిగా హీరోయిన్ నందిత శ్వేత నటిస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో అయినా సుమంత్ వరుస హిట్ అందుకుంటాడేమో!