'మళ్ళీ మొదలైంది' ట్రైలర్: విడాకుల తర్వాత యువకుడి జీవితం..!

Thu Oct 28 2021 14:19:39 GMT+0530 (IST)

Sumanth Malli Modalaindi Trailer Out Now

మళ్ళీరావా తర్వాత అలాంటి విజయం కోసం ఎదురుచూస్తున్న అక్కినేని హీరో సుమంత్ నటిస్తున్న తాజాగా చిత్రం ''మళ్ళీ మొదలైంది''. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తోంది. సుమంత్ రెండో పెళ్లి వార్తలతో ఈ మూవీకి బోలెడంత పబ్లిసిటీ లభించింది. అలానే విడాకుల తర్వాత జీవితాన్ని చూపించబోతున్నామంటూ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.కొన్ని పెళ్లిళ్లు విడాకులతో ఎండ్ అవుతాయి అంటూ టామ్ క్రూయిజ్-నికోల్ కిడ్.. మ్యాన్ బిల్ గేట్స్-మిలిందా గేట్స్.. బ్రాడ్ ఫైట్-ఏంజిలినా జోలీ జంటలను చూపించడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. విడాకులు తీసుకున్న తర్వాత ఓ వ్యక్తి జీవితంలో జరిగిన ప్రేమ - ఇతరులు అతని పై చూపించే సానుభూతి వంటి అంశాలను ఇందులో ప్రస్తావించారు. వర్షిణి తో విడాకులు తీసుకున్న సుమంత్.. ఆ కేసులో తన భార్య తరపున వాధించిన లాయర్ నైనా ను లవ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జరిగిన పరిస్థితులను ఫన్నీగా చూపించారు.  

విడాకులు తీసుకున్న సుమంత్ తో నైనా ఎలా ప్రేమలో పడింది? వీరిద్దరూ పెళ్లి చేసుకొని మళ్ళీ జీవితం మొదలు పెట్టారా లేదా? అనేది తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. కన్ఫ్యూజ్డ్ పర్సన్ గా సుమంత్ ఆకట్టుకుంటున్నాడు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతున్న ఈ చిత్రంలో సుమంత్-నైనా జోడీ ఫ్రెష్ గా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అయినట్లు తెలుస్తోంది.

'మళ్ళీ మొదలైంది' చిత్రంలో సుహాసిని మణిరత్నం - మంజుల ఘట్టమనేని - వెన్నెల కిషోర్ - పోసాని కృష్ణ మురళి - అన్నపూర్ణ - తాగుబోతు రమేష్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. అనుప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. కృష్ణ చైతన్య పాటలు రాశారు. శివ జీఆర్ఎన్ సినిమాటోగ్రఫీ అందించగా.. అర్జున్ సురిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు.

రెడ్ సినిమాస్ చరణ్ తేజ్ సమర్పణలో కె. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నారు. సరికొత్త కథాంశంతో రూపొందుతున్న 'మళ్ళీ మొదలైంది' సినిమాతో సుమంత్  మంచి సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.