అనగనగా ఒక రౌడీ! చూస్తుంటే కొడాలి నానీలా అనేశాడు!!

Sat Oct 31 2020 23:00:00 GMT+0530 (IST)

What a rowdy! looks like Kodali Nani !!

ఎర్ర పంచె.. నల్ల చొక్కాయ్.. కోర మీసం .. గుబురు గడ్డం .. ఎవరీ అబ్బాయి? ఏమిటా తీక్షణమైన చూపులు? అంటారా? ఇంకెవరు హీరో సుమంత్ ఆయన. ఏమిటిలా రౌడీ అయ్యాడు? అంటారా? ఆ సంగతిని ఆయనే ఒప్పుకున్నారు. అనగనగా ఒక రౌడీ! అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ కూడా ఇచ్చారు సుమంత్.ఇంతకీ రౌడీగా అవతారం ఎత్తడం ఎందుకు? అంటారా.. పరిస్థితిలే రౌడీని చేసి ఉంటాయి లెండి!! ఇంతకీ ఈ ఫోటో చూశాక సుమంత్ కి కాంప్లిమెంట్లు వచ్చాయా? ట‌్రోలింగ్స్ ఎదురయ్యాయా? అంటే.. అదిరిపోయే కాంప్లిమెంటే దక్కింది. ``చూస్తుంటే అచ్చం ఫలానా మంత్రి లా ఉన్నావు..! ఎనీ వే బెస్ట్ లుక్!! `` అంటూ పంచ్ వేశాడో అభిమాని. ఇంతకుమించి సుమంత్ కి ప్రశంస ఇంకేం కావాలి?

లుక్కు బాగా క్లిక్కయ్యింది. సుమంత్ కి యాప్ట్ అయ్యింది. దీనికి సాటి హీరో సుశాంత్ కూడా ప్రశంసలు కురిపించాడు. పలువురు సెలబ్రిటీలు మెచ్చుకున్నారు. ఇంతకీ ఏ మూవీలో ఈ గెటప్? అంటే... మాస్ యాక్షన్ మూవీ `కపటధారి` లో లుక్ ఇది. ఇటీవలే రిలీజైన టీజర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈలోగానే ఈ లుక్ ని రిలీజ్ చేసి హైప్ పెంచాడు సుమంత్. మళ్లీ రావా.. తరహాలో మరోసారి హిట్టు కొడతాడు సుమంత్ అంటూ అభిమానులు పాజిటివ్ వ్యాఖ్యలు చేస్తుండడం తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి కపటధారిపై.

‘‘ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. అన్నిటికీ ఓ కారణం ఉంటుంది’’ అన్న క్యాప్షన్ ఆకట్టుకుంది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ ఇది. ‘సుబ్రహ్మణ్యపురం’ ‘ఇదంజగత్’ చిత్రాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సుమంత్ ఇప్పుడు ‘కపటధారి’ తో మరో హిట్టు కొడతారేమో చూడాలి.

కన్నడలో సూపర్ హిట్ అయిన ‘కవలుదారి’ సినిమాకు ఇది తెలుగు రీమేక్. జి.ధనంజయన్ సమర్పణలో క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై లలిత ధనంజయన్ ఈ సినిమాను తెలుగు- తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు. అయితే ఇందులో ఆ రౌడీ గెటప్ సంథింగ్ స్పెషల్ గా ఆకర్షిస్తోంది.