స్టార్ యాంకర్ స్టెప్పులేస్తే ఇలా ఉంటది.!

Sun Jun 07 2020 12:00:01 GMT+0530 (IST)

Suma Kanakala Superb Dance For Ramulo Ramula Song

టాలీవుడ్ నంబర్ 1 యాంకర్ సుమ గళగళాగోదారిలా మాటల ప్రవాహంతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తుంటుంది.  బుల్లితెరపై తిరుగులేని యాంకర్ అయిన సుమ ఈ లాక్ డౌన్ వేళ షూటింగ్ లన్నీ బంద్ కావడంతో ఇంట్లోనే సేదతీరుతున్నారు. ఖాళీ సమయంలో కామెడీ సిరీస్ - వంటల వీడియోలు పోస్టు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు.రెండు నెలలకు పైగా ఈ ఖాళీ సమయంలో బోర్ కొట్టిందో ఏమో కానీ సుమ తాజాగా స్టెప్పులేసింది.  టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ‘అల వైకుంఠపురం’ సినిమాలోని ‘రాములో రాములా’ పాటకు డ్యాన్స్ చేసి ఊర్రూతలూగించింది.

తాజాగా తన ఇంట్లో ఎలాంటి మేకప్ లేకుండా సుమ మల్లెపూలు పట్టుకొని చిందులేస్తూ హల్ చల్ చేశారు. ఆమెతోపాటు వీడియోలో ఓ పెంపుడు కుక్క మాత్రమే కనిపించింది. ప్రస్తుతం సుమ డ్యాన్స్ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే రాములో రాములో పాట ఎంతో పాపులర్ అయ్యింది. స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ఇదే పాటపై స్టెప్పులేసి అలరించాడు. ఇప్పుడు సుమ కూడా పాదం కదపడం విశేషంగా మారింది.