Begin typing your search above and press return to search.

సుకుమార్ కు ఊహించ‌ని ఆఫర్‌

By:  Tupaki Desk   |   14 Jan 2022 10:01 AM GMT
సుకుమార్ కు ఊహించ‌ని ఆఫర్‌
X
లెక్క‌ల మాస్టారు సుకుమార్ లెక్క‌లు వేసుకుని మ‌రీ చేసిన మూవీ `పుష్ప ది రైజ్‌`. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము దులిపేస్తోంది. వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు సాధించ‌డ‌మే కాకుండా ఉత్త‌రాదిలో మ‌రీ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన రీతిలో బాక్సాఫీస్ వ‌ద్ద హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఉత్త‌రాదిలో `పుష్ప‌`కు ఊహించ‌ని క్రేజ్ ల‌భించ‌డంతో ద‌ర్శ‌కుడు సుకుమార్ చాలా హ్యాపీగా వున్నార‌ట‌. ఇదే జోష్ తో ఆయ‌న ప్ర‌స్తుతం `పుష్ప ది రూల్‌` ప‌నుల్లో బిజీగా మారిపోయార‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే స్క్రిప్ట్ లో మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టిన సుకుమార్ పార్ట్ 2 ని మార్చిలో ప‌ట్టాలెక్కించాల‌ని అప్పుడే ప్లాన్ లు మొద‌లుపెట్టార‌ట‌. ఈ మూవీ పూర్తి చేసి ఇదే ఏడాది మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమాల్ని పూర్తి చేయాల‌ని భ‌విస్తున్నారు. అందుకే `పుష్ప -2`ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని హీరో అల్లు అర్జున్ తో పాటు సుకుమార్ కూడా ప‌క్కా ప్లాన్ ని సిద్ధం చేసుకుంటున్నారు.

ఇదిలా వుంటే త్వ‌ర‌లోనే బాలీవుడ్ లో స్ట్రెయిట్ హిందీ మూవీని చేయాల‌నే ఆలోచ‌న‌లో కూడా సుకుమార్ వున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన సుకుమార్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. త‌న‌కూ బాలీవుడ్ సినిమా చేయాల‌ని వుంద‌ని, అయితే అది స్క్రిప్ట్ తో పాటు త‌న‌ని వెతుక్కుంటూ వ‌చ్చే అవ‌కాశాల‌ని బ‌ట్టి వుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.

ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్ష‌య్ కుమార్ కు త‌న‌కు మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ‌ని బ‌య‌ట‌పెట్టి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. `పుష్ప‌` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో త‌న‌కు అక్ష‌య్ కుమార్ ఫోన్ చేశార‌ని, నువ్వు నాతో క‌లిసి ప‌ని చేయాలి, ముంబైకి రా ` అని త‌న‌కు ఆఫ‌ర్ ఇచ్చార‌ని వెల్ల‌డించారు. స‌రైన స్క్రిప్ట్ దొరికితే త‌ప్ప‌కుండా అక్ష‌య్ కుమార్ తో సినిమా చేస్తాన‌ని సుకుమార్ స్ప‌ష్టం చేశారు. బాలీవుడ్ లో ప్ర‌త్యేకంగా నేను ఎవ‌రితో క‌లిసి ప‌ని చేయాల‌ని అనుకోవ‌డం లేదు. స్క్రిప్ట్ ని బ‌ట్టే హీరో ఎవ‌ర‌న్న‌ది నిర్ణ‌యించుకుంటాను. అయితే ఇప్ప‌డు మాత్రం అక్ష‌య్ కుమార్ తో క‌లిసి సినిమా చేయాల‌నుకుంటున్నాను` అని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు సుకుమార్‌.

ఇక ఇదే సందర్భంగా `పుష్ప‌` సీక్వెల్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు. ఇప్ప‌డు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ చిత్రంతో అత‌న్ని ఆల్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. అంతే కాకుండా పార్ట్ 2 లో ఫాహ‌ద్ ఫాజిల్ పాత్ర నిడివి ఎక్కువ‌గా వుంటుంది. ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, భావోద్వేగాలు అంచ‌నాల‌కు అంద‌ని స్థాయిలో వుంటాయి అని అంతా భావిస్తున్నారు. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోసి స్థాయిలో `పుష్ప -2` వుంటుంది అని క్లారిటీ ఇచ్చారు సుకుమార్‌.