Begin typing your search above and press return to search.

సుక్కు మ‌న‌సు మార్చుకొన్నాడా?

By:  Tupaki Desk   |   3 Dec 2015 9:30 AM GMT
సుక్కు మ‌న‌సు మార్చుకొన్నాడా?
X
త‌న స్నేహితుడు దేవిశ్రీప్ర‌సాద్‌ ని హీరోగా తెర‌కు ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ను త‌న భుజాన వేసుకొన్నాడు స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌. దిల్‌ రాజు నిర్మించ‌నున్న ఆ సినిమా గురించి ఇటీవ‌ల ప్ర‌క‌ట‌న వెలువ‌డిన విష‌యం తెలిసిందే. దేవితో ఓ ప్రేమ‌క‌థ తీయ‌బోతున్నామ‌ని దిల్‌ రాజు చెప్పిన‌ప్ప‌టికీ... సుక్కు మాత్రం వేరే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. సంగీతానికి ప్రాధాన్య‌మున్న క‌థ‌తోనే దేవిని ప‌రిచ‌యం చేయాల‌న్న ఆలోచ‌న‌లో సుక్కు ఉన్న‌ట్టు తెలిసింది. అందుకోసం రాక్‌ స్టార్ అనే పేరును కూడా రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

ప్రేమ‌క‌థ‌లు తీయ‌డంలో స్పెష‌లిస్టే అయినా... దేవిపై ప్రేమ‌క‌థ అంత బాగుండదేమో అని సుకుమార్ అభిప్రాయ‌ప‌డుతున్నాడ‌ట‌. అందుకే మ్యూజిక్ బేస్డ్ స‌బ్జెక్ట్‌ తో లైట్‌ గా ల‌వ్ పాయింట్‌ ని ట‌చ్ చేస్తూ సినిమా తీయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇదివ‌ర‌కే మ‌హేష్‌ బాబుని `1` సినిమాలో రాక్‌ స్టార్‌ గా చూపించాడు సుక్కు. ఈసారి దేవిని అందుకు భిన్నంగా తెర‌పై చూపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం నాన్న‌కు ప్రేమ‌తో చిత్రంతో బిజీగా గ‌డుపుతున్నాడు సుకుమార్‌. ఆ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాగానే దేవితో సినిమానే మొద‌లుపెట్ట‌బోతున్నాడు. దేవి శ్రీ ప్ర‌సాద్ న‌టించ‌నున్న సినిమాకి సంబంధించిన స్క్రిప్టు ప‌నులు కూడా పూర్తి చేసిన‌ట్టు తెలిసింది.